Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా బ్యాక్ డ్రాప్‌లోమేఘ ఆకాష్ చిత్రం

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (12:07 IST)
Rahul Vijay, Megha Akash
రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై  ఎ సుశాంత్ రెడ్డి,  అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా...అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ను శరవేగంగా పూర్తి చేసుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం చిత్రబృందం సిద్ధమవుతోంది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు అభిమన్యు బద్ది మాట్లాడుతూ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ తో  సింగిల్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో గోవాలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తాం. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. గోవా బ్యాక్ డ్రాప్‌లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో సినిమా అనుకున్నది అనుకున్నట్లు బాగా వస్తోంది. అన్నారు. 
 
నటీనటులు - రాహుల్ విజయ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్,అభయ్ బెతిగంటి, వైవా హర్ష,బిగ్ బాస్ సిరి తదితరులు
 
సాంకేతిక నిపుణులు - సంగీతం: హరి గౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ : కె. వి రమణ, సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి , నిర్మాత: ఏ.సుశాంత్ రెడ్డి & అభిషేక్ కోట, సమర్పణ: బిందు ఆకాష్, నిర్మాణ సంస్థలు: కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్, కథ : ఏ.సుశాంత్ రెడ్డి, దర్శకత్వం - అభిమన్యు బద్ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments