Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి, సుస్మిత కొణిదెల, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మెగా156 అనౌన్స్ మెంట్

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (15:19 IST)
Mega156 poster
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా బర్త్ డేని జరుపుకునే అభిమానులకు ఇది ఒక పండగ లాంటి రోజు. మెగా అభిమానులను మరింత ఆనందపరిచే విధంగా, మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం మెగా156 ఈరోజు అనౌన్స్ చేశారు.
 
మెగా156 చిత్రాన్ని చిరంజీవి ఖైదీ నంబర్ 150వ చిత్రం నుండి స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్న సుస్మిత కొణిదెల భారీ స్థాయిలో నిర్మించనున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మెగా156 రూపొందనుంది. త్వరలోనే చిత్ర దర్శకుడిని అనౌన్స్ చేస్తారు.
 
'నాలుగు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ. భావోద్వేగాలను కలిగించే అపారమైన వ్యక్తిత్వం. తెరపైన, బయట పండగ లాంటి వ్యక్తి. 155 చిత్రాల తర్వాత, ఇప్పుడు #MEGA156 మెగారాకింగ్ ఎంటర్టైనర్ అవుతుంది. చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు'' అని ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేసింది.
 
సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi Election Trends: బీజేపీ విజయం ఖాయం.. రాహుల్ గాంధీకి అభినందనలు - కేటీఆర్ సెటైర్లు (video)

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. రామ్ గోపాల్ వర్మపై కేసు.. సీఐడీ నోటీసులు

అంతులేకుండా పోయిన ఆప్, కమలనాథులదే ఢిల్లీ పీఠం

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం

ప్రధాన మంత్రి మోదీని కలిసిన ఏఎన్నార్ ఫ్యామిలీ.. బహుమతిగా కొండపల్లి బొమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments