Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాను పెళ్లి చేసుకుని సినిమాతో సంసారం చేస్తున్న యోగి...

Webdunia
బుధవారం, 22 మే 2019 (10:12 IST)
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తాజా చిత్రం "మార్కెట్‌లో ప్రజాస్వామ్యం". ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నారాయణమూర్తి గురించి అద్భుతమైన ప్రసంగం చేశారు. 
 
ఆర్. నారాయణ మూర్తి ఒక సినిమా పిచ్చోడన్నారు. ఆయన సినిమాను పెళ్లి చేసుకుని, సినిమాతో సంసారం చేస్తూ, సినిమాలనే తన పిల్లలుగా భావిస్తున్న సినిమా యోగి అని కొనియాడారు. ఆర్ నారాయణ మూర్తితో తనకు నాలుగు దశబాద్దాల అనుబంధం ఉందన్నారు. తామిద్దరం ప్రాణం ఖరీదు చిత్రంలో నటించామని గుర్తుచేశారు. ఆర్. నారాయణ మూర్తి ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు తనను ఆహ్వానించడం ఆశ్చర్యానికి లోనయ్యాయని చెప్పారు. ఆయన ఫంక్షన్‌కు రావడం తన కుటుంబ సభ్యుడు కార్యక్రమానికి వచ్చినట్టుగా ఉందని చిరంజీవి ఉందన్నారు. 
 
ఇకపోతే, మెగాస్టార్ చిరంజీవితో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి పకోడీలు తినిపించారు. ఈ అరుదైన దృశ్యం ఈ చిత్రం ఆడియో లాంచ్‌లో జరిగింది. సాధారణంగా చిరంజీవి ఏ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లినా ఎలాంటి తినుబండారాలు తీసుకోకుండా వెళ్లిపోతారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని అక్కడున్న వారు భావించారు. 
 
కానీ, అందరూ ఆశ్చర్యపోయేలా ప్లేట్‌లో పకోడీలు పెట్టి.. చిరంజీవి చేతికి ఇచ్చి అవి తినేవరకూ ఆర్. నారాయణ మూర్తి అక్కడే ఉన్నారు. ఎవరూ ఊహించని ఈ పనిని మెగాస్టార్‌తో పీపుల్స్ స్టార్ చేయించడంతో ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతైంది. ప్రస్తుతం చిరంజీవి పకోడీలు తింటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments