Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ మనసు బంగారం తల్లీ. సెల్యూట్ మీరాబాయి చాను: చిరంజీవి

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (14:15 IST)
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం తీసుకొచ్చిన మణిపూర్‌ మణిపూస మీరాబాయి చాను వ్యక్తిత్వంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె భారత్ చేరుకున్న తర్వాత.. తనకు గతంలో సాయం చేసిన వారిని కలవడం పట్ల చిరంజీవి ఎంతగానో మెచ్చుకున్నారు.
 
'మీరాబాయి చాను.. దేశం గర్వించేలా ఒలింపిక్స్‌లో వెయింట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన ఇండియన్. ఇంటికి చేరిన రోజు నుంచి కొందరు వ్యక్తుల కోసం ఆమె వెతుకుతూనే ఉంది. చివరికి వారందరినీ ఇంటికి పిలిచింది. మొత్తం 150 మంది ఉన్నారు. అందరికీ భోజనాలు పెట్టి, బట్టలు పెట్టి, కాళ్లు మొక్కింది. 
 
ఇంతకీ వాళ్లందరూ ఎవరో తెలుసా? తన ఊరి నుంచి పాతిక మైళ్ల దూరంలో ఉన్న ఇంఫాల్ స్పోర్ట్స్ అకాడమీకి వెళ్లేందుకు, మీరాబాయికి రోజూ లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లు, హెల్పర్లు. ఇది కదా గెలుపు మలుపులో సాయం చేసిన ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత చూపడం అంటే! నీ మనసు బంగారం తల్లీ. సెల్యూట్ మీరాబాయి చాను' అంటూ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments