Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) ప‌థ‌కాలు అద్భుతం - మెగాస్టార్ చిరంజీవి

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (13:49 IST)
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఇటీవ‌లే కొత్త ప‌థ‌కాల్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు మా అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శ‌కులు శివాజీ రాజా, సీనియ‌ర్ న‌రేష్ ఈ ప‌థ‌కాల వివ‌రాల్ని అందించారు. మా డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌- విజ‌య నిర్మ‌ల, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు- శ్యామ‌లా దేవి దంప‌తులు ఈ ప‌థ‌కాల్ని ప్ర‌శంసించి త‌మ‌వంతు సాయాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 
 
తాజాగా ఈ ప‌థ‌కాల‌కు ప్ర‌త్యేకించి విడివిడిగా నామ‌క‌ర‌ణం చేసింది మా అసోసియేష‌న్. ఈ ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయ‌ని, మూవీ ఆర్టిస్టుల సంఘం మంచి ప‌నులు చేసేందుకు ప్ర‌తిసారీ ముందుకొస్తోంద‌ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. మా అధ్య‌క్షుడు శివాజీరాజా, ఇత‌ర స‌భ్యుల కృషిని ప్ర‌త్యేకంగా అభినందించారు.
 
2019 జ‌న‌వ‌రి -1 నుంచి `మా అసోసియేష‌న్‌` త‌మ మెంబ‌ర్స్ కోసం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల వివ‌రాలివి. `డా.చిరంజీవి మా క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం` పేరుతో రూ.1,16,000 మొత్తాన్ని పెళ్లి చేసుకునే ఆడ‌పిల్ల‌కు అంద‌జేస్తారు. `డా.ఏఎన్నార్ మా విద్యా ప‌థ‌కం` పేరుతో 80 శాతం స్కోర్ చేసిన పిల్ల‌ల‌కు రూ.1,00,000 అంద‌జేస్తారు. డా.విజ‌య‌నిర్మ‌ల మా చేయూత ప‌థ‌కం పేరుతో వృద్ధుల‌కు నెల‌వారీ ఫించ‌ను రూ.5000 చొప్పున అందిస్తారు. 
 
ఇదివ‌ర‌కూ రూ.2000గా ఉన్న ఫించ‌నును రూ.5000కు పెంచారు. 35 మంది స‌భ్యుల‌కు ఈ ఫించ‌ను అంద‌నుంది. `శ్రీ‌కాంత్ మా మాన‌వ‌తా ఎల్ఐసీ ప‌థ‌కం` పేరుతో రూ.3,00,000 ఇన్సూరెన్స్ స‌దుపాయం మెంబ‌ర్స్‌కి క‌ల‌గ‌నుంది. ఇలాంటి ఉదాత్త‌మైన‌ ప‌థ‌కాలు భార‌త‌దేశంలోనే వేరొక సినీ ప‌రిశ్రమ‌లో ఎక్క‌డా అమ‌లు చేయ‌లేదని పరిశ్రమ ప్రముఖులు ప్రశంసలు కురిపించడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments