Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌ముఖ నిర్మాత శేఖ‌ర్ బాబు క‌న్నుమూత‌... సంతాపం తెలిపిన చిరు

ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖ‌ర్ బాబు (71) శుక్ర‌వారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కృష్ణ -జ‌మున కాంబినేష‌న్లో `మమత` అనే చిత్రాన్ని,

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (16:39 IST)
ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖ‌ర్ బాబు (71) శుక్ర‌వారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కృష్ణ -జ‌మున కాంబినేష‌న్లో `మమత` అనే చిత్రాన్ని, త‌ర్వాత అదే హీరోతో `స‌ర్దార్`, మెగాస్టార్ చిరంజీవితో `ముఠామేస్త్రీ`, `సంసారబంధం`, `గోపాలరావుగారి అమ్మాయి`, `పక్కింటి అమ్మాయి` చిత్రాలను నిర్మించారు.
 
సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కూడా ఆయ‌న విశేష సేవ‌లందించారు. ఫిలిం సెంట్ర‌ల్ బోర్డ్ చైర్మ‌న్‌గా, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీగా ఆయ‌న ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాది ఫిలించాంబ‌ర్ క‌మిటీ మెంబ‌ర్‌గా సేవ‌లందిస్తున్నారు. ఇంత‌లోనే ఆయ‌న హఠాన్మ‌ర‌ణం టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ని క‌ల‌చి వేసింది. శేఖర్‌బాబు మృతిపట్ల పలువురు సినీ నటులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. చిరంజీవి శేఖర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments