Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘మీరంతా గర్వించేలా.. 'ఇదిరా! చిరంజీవి' అనేలా 'ఖైదీ' ఉంటుంది : చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఇది మెగాస్టార్ 150వ చిత్రం. ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాత కాగా, వివి వినాయక్ దర్శకుడు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (14:54 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఇది మెగాస్టార్ 150వ చిత్రం. ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాత కాగా, వివి వినాయక్ దర్శకుడు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఇదిలావుంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 2017 సంవత్సరం కోసం రూపొందించిన డైరీని చిరంజీవి ఆవిష్కరించారు. 
 
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ... ‘ఈ చిత్రంతో తిరిగి వస్తున్నందుకు తమ్ముళ్లు 150 గులాబీలు ఉన్న పుష్పగుచ్ఛం ఇచ్చి ఉత్సాహపరచడం సంతోషంగా ఉంది. నా తమ్ముళ్ల చూపిస్తున్న ప్రేమ మురిపిస్తోంది. కళామతల్లి ముద్దుబిడ్డలుగా నాపై ప్రేమ కురిపిస్తున్నందుకు మైమరచిపోతున్నాను. 
 
ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరించే చిత్రమవుతుంది. ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివాజీరాజా ఆధ్వర్యంలోని టీమ్ అందరూ మెచ్చుకునేలా ‘మా’ని నడిపిస్తున్నారు. ‘మా’ అసోసియేషన్ ఫౌండర్ అధ్యక్షుడిగా వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. అందరికీ, క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు’. చివరగా ఓ మాట చెపుతున్నా... ‘మీరంతా గర్వించేలా.. 'ఇదిరా! చిరంజీవి'.. అనేలా ఖైదీ నంబర్ 150 సినిమా ఇస్తాను. ది బెస్ట్ పెర్ఫామెన్స్‌ని ఇస్తాను’ అని చిరంజీవి అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments