Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గోల్డెన్ హార్ట్' సోనూ సూద్‌కి ఆచార్య టీమ్ సత్కారం

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (18:22 IST)
డబ్బు అందరికీ వుంటుంది. ఈ డబ్బు కొందరికి ఎక్కువగానూ మరికొందరికి తక్కువగానూ వుంటుంది. ఐతే వున్నదాంట్లోనే నిరుపేదలకు సాయం అందించాలని హృదయం మాత్రం కొద్దిమందికి మాత్రమే వుంటుంది. అలాంటి వారిలో సోనూ సూద్ ఒకరు.

లాక్ డౌన్ కాలంలో ఆయన పేదల కోసం చేసిన సహాయక చర్యలు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయన సేవలను ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించింది.
ఇదిలావుంటే శనివారం నుంచి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ షూటింగులో పాల్గొనేందుకు సోనూ సూద్ వచ్చారు. ఈ నేపధ్యంలో ఆచార్య సెట్స్‌కి వచ్చిన సోనూని చిత్ర బృందం ఘనంగా సత్కరించింది. చిత్ర దర్శకుడు కొరటాల శివ, నటుడు తనికెళ్ల భరణి సోను చేస్తున్న నిరంతరాయమైన సేవకు ప్రశంసలు కురిపించారు. ఆయనను శాలువతో సన్మానించారు. తనికెళ్ల భరణి హనుమంతుడి విగ్రహాన్ని బహూకరించారు.
 
కాగా మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఖైదీ నెం 150లో జత కట్టిన కాజల్ అగర్వాల్ రెండోసారి జత కడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారు.. పవన్ సీరియస్

కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్

AP Cabinet: మే 20న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం

హనీట్రాప్ వివాదంలో పాక్ దౌత్యవేత్త... అమ్మాయితో అశ్లీల వీడియో

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments