Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 13న వస్తున్న "ఆచార్య" ... టీజర్‌తో ధర్మస్థలి దద్ధరిల్లిపోతోంది..

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (18:19 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ శుక్రవారం విడుదలైంది. సరిగ్గా 4.05 గంటలకు ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కేవలం 2 గంటల్లోనే 4,43,821 వ్యూస్‌ను సొంతం చేసుకుని, ధర్మస్థలి దద్ధరిల్లిపోయేలా చేసింది. అదేసమయంలో ఈ చిత్రం విడుదల తేదీని 5.30 గంటలకు గ్రాండ్‌గా ప్రకటించారు. 
 
ఈ చిత్ర యూనిట్ చేసిన ప్రకటన మేరకు.. 'ఆచార్య' మే 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని కొణిదెల ప్రొ కంపెనీ వెల్లడించింది. ఈ సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుదలైన టీజర్ మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న తరుణంలోనే సినిమా విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ వెల్లడించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
 
కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సందేశాత్మక కమర్షియల్ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల వచ్చిన చిరంజీవి ఫస్ట్‌‍లుక్ 'ఆచార్య' సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇందులో 'ధర్మస్థలి' కాన్సెప్ట్‌పై అందరిలోనూ ఆసక్తి అధికమవుతోంది. 'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments