Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇంద్ర' చిత్ర బృందానికి మెగాస్టార్ చిరు సత్కారం

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (18:44 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "ఇంద్ర". బి.గోపాల్ దర్శకత్వంలో బడా నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై 22 యేళ్లు గడిచిపోయింది. దీన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని 4కేలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదల చేసినపుడు ఏ విధంగా అయితే, సునామీ క్రియేట్ చేసిందో అదేవిధంగా రీరిలీజ్‌లోనూ మంచి కలెక్షన్లు రాబడుతుంది. 
 
ఈ రిలీజ్‌ను పురస్కరించుకుని ఆ చిత్ర బృందానికి చిరంజీవి చిరు సత్కారం చేశారు. చిత్ర దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు అశ్వినీదత్‌, కె.ఎస్.రామారావు, కథా రచయిత చిన్నికృష్ణ, మాటల రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వర రావు, సంగీత దర్శకుడు మణిశర్మలను ఆయన తన నివాసానికి ఆహ్వానించి వారికి శాలువాలు కల్పి, పుష్కగుచ్చాలు ఇచ్చి అభినందించారు. 
 
ఈ సందర్భంగా వారి మధ్య ఆత్మీయ సంభాషణ జరిగింది. ముఖ్యంగా, సినిమా మేకింగ్ సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఈ ఆత్మీయ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగినట్టు మెగాస్టార్ చిరంజీవిన తన ఎక్స్ ఖాతాలో వారితో దిగిన ఫోటోతో పాటు ఓ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజధాని అమరావతి కోసం పదో 10 ఎకరాల భూమి సేకరణ : మంత్రి నారాయణ

ఎంత గింజుకున్నా... సీఎం రేవంత్ రెడ్డి నా స్థాయికి రాలేరు : హరీశ్ రావు

బీహార్‍ రాష్ట్రాన్ని జేడీయూ - ఆర్జేడీలు ముంచేశాయి : ప్రశాంత్ కిషోర్

బిర్యానీలోని లెగ్ పీస్‌లకు బదులు కోడి ఈకలు- వీడియో వైరల్

అధికారం వచ్చిన గంటలోనే మద్యపాన నిషేధం ఎత్తివేస్తా.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments