Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ది గోట్ మూవీలో విజయ్ డీ-ఏజింగ్ లుక్.. అదొక గుణపాఠమన్న దర్శకుడు!

Advertiesment
the goat movie

ఠాగూర్

, ఆదివారం, 18 ఆగస్టు 2024 (14:56 IST)
వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ అగ్రహీరో విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గోట్'. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం రాత్రి చెన్నై నగరంలో రిలీజ్ చేశారు. ఇందులో ఆ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ, ఈ మూవీలో హీరో డీ ఏజింగ్ లుక్‌పై విమర్శలు వచ్చాయని, ఇది మాకు ఒక గుణపాఠమన్నారు. 
 
ముఖ్యంగా తాజాగా ఈ చిత్రం నుంచి స్పార్క్ పేరుతో సాగే తొలి సింగిల్‌లు రిలీజ్ చేసినట్టు చెప్పారు. ఇందులో విజయ్‌ డీ- ఏజింగ్‌ విషయంలో ప్రేక్షకుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాం. హీరో విజయ్‌ కూడా దానిపై అభిప్రాయం చెప్పారు. మంచి సలహాలిచ్చారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేశాం. ట్రైలర్‌లో చూసిన లుక్కే ఫైనల్‌ది. దాన్నే సినిమాలోనూ చూస్తారు. మాకు ఇదొక పాఠంలాంటిది' అని సమాధానమిచ్చారు. 
 
అలాగే, స్పార్క్ పాటపై వచ్చిన మిశ్రమ స్పందన గురించి డైరెక్టర్‌ మాట్లాడుతూ, 'ఈ సినిమా సాంగ్స్‌ విషయంలో మిక్స్‌డ్‌ టాక్‌ వినిపించింది. కానీ, తెరపై అందరినీ అలరిస్తాయి. అవి విజువల్‌ ట్రీట్‌' అని ఆసక్తి రేకెత్తించారు. 'ది గోట్' మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెప్పారు. అందుకే ఈ సినిమా కోసం డీ-ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించినట్టు చెప్పారు. దాని సాయంతోనే విజయ్‌ను కుర్రాడిగా చూపించే ప్రయత్నం చేశారు. దీంతోపాటు మరో గెటప్పులోనూ ఆయన సందడి చేయనున్నారు. 
 
మీనాక్షీ చౌదరి హీరోయిన్‌ కాగా స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబరు 5న సినిమా విడుదల కానుంది. తమిళనాడులోని ప్రతి థియేటర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టీమ్‌ నిర్ణయించుకుంది. కోలీవుడ్‌ చరిత్రలో ఈ స్థాయిలో రిలీజ్‌ కానున్న ఏకైక చిత్రంగా నిలవనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19న హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్