Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పెళ్ళి పత్రికను జాగ్రత్తగా దాచుకున్న మెగాస్టార్.. ఎందుకో తెలుసా...

ఎంత పెద్ద ప్రముఖుడైనా తనకు సంబంధించిన జ్ఞాపకాలను జాగ్రత్తగా దాచుకోవాలని భావిస్తాడు. అలాంటివారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. నిజమే. తన పెళ్ళి పత్రికను ఇప్పటికీ అతి జాగ్రత్తగా తన ఇంటిలో లామినేషన్ చే

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (10:41 IST)
ఎంత పెద్ద ప్రముఖుడైనా తనకు సంబంధించిన జ్ఞాపకాలను జాగ్రత్తగా దాచుకోవాలని భావిస్తాడు. అలాంటివారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. నిజమే. తన పెళ్ళి పత్రికను ఇప్పటికీ అతి జాగ్రత్తగా తన ఇంటిలో లామినేషన్ చేసుకుని మరీ దాచిపెట్టుకునివున్నారు. ఇది నిజమే. చిరంజీవికి వివాహమై సరిగ్గా ఈనెల 20వ తేదీతో 38 సంవత్సరాలు. 
 
1980 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన చెన్నైలోని ఎల్లీస్ రోడ్డులో చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. ముహూర్తం అదేరోజు ఉదయం 10.50 నిమిషాలకు, రిసెప్షన్ 6 నుంచి 8 గంటల మధ్య, డిన్నర్ రాత్రి 8 గంటలకు జరిగినట్లు శుభలేఖలో ఉంది. 
 
ప్రముఖ హాస్యనటుడు, దివంగత నేత అల్లు రామలింగయ్య పెళ్ళికి ఆహ్వానిస్తున్నట్లుగా పెళ్ళి పత్రికలో ఉంది. దీన్ని ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా దాచుకున్నారు చిరంజీవి. మంగళవారం ఆయన పెళ్ళిరోజు కావడంతో ఇంటిలో ల్యామినేషన్ చేసి ఉంచిన పెళ్ళిపత్రికను చూసి ఆశ్చర్యపోయారట మెగా కుటుంబ సభ్యులు. 
 
ఇన్ని యేళ్ళయినా ఇంత జాగ్రత్తగా ఎలా పెట్టుకున్నారంటూ చిరంజీవి ప్రశ్నించారట ఆయన కుమారుడు, హీరో రాంచరణ్. జీవితంలో మరుపురాని సంఘటన ఏదైనా ఉంటే నేను మొదటగా చెప్పేది ఇదేనంటూ తన కుమారుడు చరణ్‌కు చెప్పుకొచ్చారట చిరంజీవి. ఆ పత్రిక మీరు కూడా చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments