Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా పవర్‌ చిత్రం ప్రారంభం

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (16:46 IST)
Sri Kalyan, Shashi, Raghubabu
సత్య ఆర్ట్స్‌ పతాకంపై ‘మెగా పవర్‌’ చిత్రం ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. శ్రీ కల్యాణ్‌, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకుడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రఘుబాబు క్లాప్‌ ఇచ్చారు. ికిరణ్‌ అబ్బవరం కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. పృథ్వీరాజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సినిమా టైటిల్‌ను విడుదల చేశారు.
 
హీరో మాట్లాడుతూ ‘‘హీరోగా తొలి చిత్రమిది. లైన్‌ బావుంది. కథ మీద బాగా వర్క్‌ చేశాం. నా మీద నమ్మకంతో మా బాబాయ్‌ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్‌ టీమ్‌ చేస్తున్నాం.  వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తాం. ఇతర  వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు. హీరోయిన్‌ శశి మాట్లాడుతూ ‘‘తెలుగులో తొలి చిత్రమిది. హీరోయిన్‌ పరిచయానికి చక్కని కథ ఇది అన్నారు.
 
దర్శకుడు రవిచంద్ర మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌గారి ఆశీస్సులతో సత్య ఆర్ట్స్‌ పతాకంపై తొలి చిత్రం ప్రారంభమైంది. మదర్‌ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. యాక్షన్‌ సీన్స్‌ కోసం తగిన జాగ్రత్తలతో హీరో శిక్షణ పొందారు. త్వరలో ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్‌ చేస్తాం. అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. అలాగే పండుగ బిజీలో ఉంది కూడా మా సినిమా ప్రారంభానికి వచ్చిన కిరణ్ అబ్బవరం, రఘుబాబు, పృథ్వీ గార్లకు థాంక్స్ ’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments