Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక పెళ్లి చీరలపైనే సోషల్ మీడియాలో చర్చ.. బంగారు వర్ణం శారీ ఎంతంటే? (video)

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (13:52 IST)
మెగా డాటర్ నిహారికా కొణిదెల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకలో నిహారికకు వచ్చిన కానుకలు కోట్ల విలువ చేసేవని తెలిసింది. పెళ్లి సందర్భంగా మెగాస్టార్ ఏకంగా రూ.2కోట్ల విలువైన కానుకను అందించగా.. మెగా హీరోలందరూ నిహారికకు ఖరీదైన బహుమతులు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.5 నుంచి రూ. ఆరు కోట్ల వరకు ఉంటుందట. 
 
తాజాగా నిహారిక పెళ్లికి ధరించిన చీరలపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుకలో మంగళ స్నానానికి ఆకుపచ్చ చీరను, హల్దీలో బంగారు వర్ణం చీరను పెళ్లి కూతురు వేడుక కోసం నీలం బంగారు రంగు చీరను ఎంచుకుంది. 
 
నిశ్చితార్థం వేళ.. నిహారిక తల్లి ధరించిన 32 ఏళ్ల నాటి చీరను నిహారిక ధరించింది. వాటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమె మేకప్ ఆర్టిస్ట్ శాండీ వధువు చిత్రాన్ని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఇవన్నీ వైరల్ అయ్యాయి. తాజాగా తన కూతురి పెళ్లి కోసం నాగబాబు సుమారు రూ.3కోట్ల వరకు ఖర్చు చేశారట. ఈ పెళ్లిలో నిహారిక కట్టుకున్న చీర ఖరీదుపైనా నోరెళ్లబెడుతున్నారు. బంగారు వర్ణం డిజైనర్ శారీ కోసం ఏకంగా రూ.20లక్షలు వెచ్చించారన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్‌‌గా మారింది.
 
పెళ్లికి రెండు నెలల ముందే ఈ చీరను ఆర్డర్ చేసి ప్రత్యేకంగా తయారు చేయించారట. గుజరాత్‌లో దీనిని రెడీ చేశారు. అలాగే పెళ్లి కూతురుగా నిహారిక ధరించిన ఖరీదైన నెక్లెస్‌లు దుస్తుల కోసమే కొన్ని లక్షల రూపాయల్ని ఖర్చు చేశారట. అలాగే పెళ్లి కొడుకు చైతన్య ధరించిన దుస్తులు ఆభరణాలు అంతే కాస్ట్ లీ అని తెలిసింది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments