Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు కరోనా పాజిటివ్ వచ్చింది... : నాగబాబు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (12:27 IST)
తనకు కరోనా వైరస్ సోకినట్టు మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. నిజానికి నాగబాబుకు కరోనా వైరస్ సోకినట్టు గత రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, మెగా కాంపౌడ్ ఎక్కడ కూడా పొర బయటకు రానివ్వలేదు. ఈ నేపథ్యంలో నాగబాబే స్వయంగా బుధవారం ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్ తేలింది. తొంద‌ర‌గా క‌రోనాను జ‌యించి ప్లాస్మాను దానం చేస్తాన‌ని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, నాగ‌బాబు గ‌త కొన్నిరోజులుగా ఓ ఛాన‌ల్‌లో వ‌చ్చే కామెడీ షో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అక్కడ నుంచే ఆయనకు ఈ వైరస్ సోకివుంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నాగ‌బాబు సూచించారు. నాగ‌బాబు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అత‌ని అభిమానులు రీట్వీట్లు పెడుతున్నారు.
 
మరోవైపు, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ వైరస్ బారినపడికోలుకుంటున్నారు. ఇలాంటి వారిలో నిర్మాత బండ్ల గణేష్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, దర్శకుడ తేజ తదితరులు ఉన్నారు. అయితే, లెజెండరీ గాయకుడు ఎస్‌పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా ఈ వైరస్ బారినపడి మృత్యుకోరల నుంచి బయటపడ్డారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments