కరోనాతో నటుడు జయప్రకాష్ రెడ్డి కుటుంబం గత వారంరోజుల నుంచి ఇబ్బంది పడుతోంది. జయప్రకాష్ రెడ్డి కొడుకు, కోడలు, పిల్లలు అందరికీ కూడా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే పరీక్ష చేసుకున్న సమయంలో జయప్రకాష్ రెడ్డికి మాత్రం నెగటివ్ వచ్చింది.
అయినా సరే జయప్రకాష్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసే ఉంటున్నారు. కుటుంబంలో కూడా అందరితోను ఎప్పుడూ సరదాగా ఉండే జయప్రకాష్ రెడ్డి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
సినిమాల్లో తనదైన శైలిలో రాణించిన జయప్రకాష్ రెడ్డి ఎన్నో క్యారెక్టర్లను పోషించారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రాయలసీమ మాండలికంలో మాట్లాడటం జయప్రకాష్ రెడ్డికి ఉన్న ప్రత్యేకత. స్వతహాగా కర్నూలు జిల్లాలో జన్మించిన జయప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరులో ఉంటున్నారు.
అయితే కరోనా కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో కుటుంబంతో సరదాగా గడుపుదామనుకున్న జయప్రకాష్ రెడ్డి కుటుంబంలో చివరకు కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయితే వైద్యుల సూచనలను పాటిస్తూ కరోనా నుంచి కోలుకుంటున్నామనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా జయప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని శోకంలో ముంచేసింది.