Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ - సంతోషం.. మీ పర్మనెంట్ అడ్రెస్ కావాలి : సునీతకు నాగబాబు విషెస్

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (15:06 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ సింగర్ సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది. యూట్యూబ్ చానెల్ అధినేత రామ్ వీరపనేని ప్రేమించి పెళ్లాడింది. ఈమెకు పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో రామ్ వీరపనేనితో స్నేహం చేసిన సునీత.. తమ స్నేహ బంధాన్ని మరింత దృఢం చేసుకుని ముందుకు కొనసాగించేందుకు వీలుగా పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 
 
గత శనివారం రాత్రి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరుగగా, ఈమెకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ట్విటర్ ద్వారా స్పందించారు. 
 
'సంతోషం అనేది పుట్టుకతో రాదు. దాన్ని మనం అన్వేషించి అందుకోవాలి. తమ సంతోషాలను కనుగొన్నందుకు రామ్, సునీతకు అభినందనలు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి మీ జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, సంతోషం అనేది ఎప్పటికీ మీ పర్మనెంట్ అడ్రెస్‌గా మారాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments