Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింగర్ సునీత వివాహంపై మెగా బ్రదర్ నాగబాబు ఏమన్నారంటే?

సింగర్ సునీత వివాహంపై మెగా బ్రదర్ నాగబాబు ఏమన్నారంటే?
, బుధవారం, 13 జనవరి 2021 (07:53 IST)
sunitha - ram
సింగర్ సునీత, బిజినెస్‌మేన్ రామ్ వీరపనేని వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సునీత వివాహంపై మెగాబ్రదర్ నాగబాబు తనదైన శైలిలో స్పందించారు. ట్విట్టర్ ద్వారా అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించే నాగబాబు.. సునీత పెళ్లిపై కూడా అంతే నిర్మోహమాటంగా మాట్లాడారు. సంతోషం అనేది పుట్టుకతో ఉండదన్న నాగబాబు.. దాన్ని మనం వెతుక్కోవాలన్నారు. 
 
రామ్ - సునీతలు ఇద్దరూ కూడా తమ సంతోషాలను కనుగొన్నందుకు శుభాకాంక్షలు అని కామెంట్ చేశారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కొందరు వెనుకడుగు వేస్తారు. కొన్నింటిని ఎంచుకునేందుకు కొందరు సిగ్గుపడతారు. వారికి ఈ జంట చక్కని ఉదాహరణగా నిలుస్తుందని కొనియాడారు. ''ప్రేమ సంతోషం అనేది ఎప్పటికీ మీ పర్మనెంట్ అడ్రెస్‌గా మారాలని కోరుకుంటున్నానని.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్" అంటూ శుభాకాంక్షలు తెలిపారు. 
webdunia
sunitha - ram
 
కాగా.. శంషాబాద్‌లోని ఓ ఆలయంలో సునీత.. రామ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. సునీత పెళ్లిపై సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సునీత-రామ్ దంపతులను అందరూ అభినందిస్తుంటే.. మరికొందరు రెండో పెళ్లి చేసుకున్న సునీతను విమర్శిస్తున్నారు. సునీత పెళ్లి ఫోటోలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తన వ్యాఖ్యల ద్వారా అలాంటి వారికి నాగబాబు కౌంటర్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Apsara Raniకి వర్మ బర్త్ డే విషెస్, త్వరగా గోవా రమ్మంటూ ట్వీట్