Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్ ప్రైమ్‌లో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ : కొత్త ట్రైలర్ విడుదల

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (17:21 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'వకీల్ సాబ్' ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని సినిమాల కంటే ఫస్ట్ డే కలెక్షన్లలో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకుంది.
 
అయితే... ప్రీమియర్ షోస్ అనుకున్న విధంగా పడకపోవడం, టిక్కెట్ రేట్ల పెంపుదలకు ప్రభుత్వాలు అంగీకరించకపోవడంతో ఈ సినిమా కలెక్షన్లపై కొంత ప్రభావం పడింది.
 
దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్ సైతం మొదలు కావడంతో ఆంధ్రాలో థియేటర్ల ఆక్యుపెన్సీపై నిబంధనలు విధించారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించారు. దాంతో చాలా థియేటర్ల యాజమానులు స్వచ్ఛందంగా తమ థియేటర్ల ను మూసి వేశారు. అయినా కొద్ది రోజులుగా 'వకీల్ సాబ్'ను కొన్ని థియేటర్లలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో నిర్మాత 'దిల్' రాజు అమెజాన్ ప్రైమ్ కు స్ట్రీమింగ్ హక్కులు ఇవ్వడం విశేషం. ఇదే నెల 30న 'వకీల్ సాబ్' అందులో ప్రసారం కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాడేపల్లి వైసిపి ఆఫీసుని అంత అర్జంటుగా ఎందుకు కూల్చివేశారో తెలుసా? (video)

సైబరాబాద్: డ్రంక్ డ్రైవ్ చేసిన 385 మంది అరెస్ట్.. రైడర్లు కూడా?

తిరుమలకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత

హైదరాబాద్‌లో తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం

అమరావతి నిర్మాణం వేగవంతం- సీఆర్‌డీఏ అధికారులతో చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments