Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్ సిక్స్‌- టీఆర్పీ రేటింగ్ 8.86 పాయింట్స్

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (13:28 IST)
బిగ్ బాస్ సీజన్ సిక్స్‌లో రెండో వారం సాగుతుంది. ఈసారి ఎలిమినేషన్ దగ్గరపడుతుండడంతో హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారా అనే దానిపై చర్చ సాగుతోంది. ఇక హౌస్‌లోకి ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో హీరో హీరోయిన్స్‌గా నటించిన సుధీర్ బాబు కృతి శెట్టిలు వచ్చారు. 
 
ఇక ఈ సెలబ్రిటీలు కూడా కంటెస్టెంట్‍‌లతో గేమ్స్ ఆడించారు. అంతేకాకుండా వారితో స్కిట్స్ కూడా చేయించారు. ఇక హౌస్‌లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కో విధమైన డైలాగ్స్ చెప్పి వారిని మెప్పించారు.
 
రేవంత్ పోకిరి డైలాగ్ చెప్పి మెప్పించగా ఆ తర్వాత గలాటా గీతూ ప్రభాస్ డైలాగ్ చెప్తూ కొట్టుకుందాం రా అంటూ చెప్పింది. ఇక శ్రీహాన్, ఫైమా ఇద్దరు కూడా స్కిట్స్ చేశారు. 
 
ఇక వీరి స్కిట్‌లో వేసే కామెడీ పంచ్ లకు కృతి శెట్టి, సుధీర్ బాబు తెగ నవ్వేశారు. ఇక మరోవైపు ఆర్ జె సూర్య విజయ్ దేవరకొండ వాయిస్‌తో ఈ వారం నేనే కెప్టెన్ అవ్వాలని చాలా డిఫరెంట్‌గా చెప్పుకొచ్చాడు. మొత్తానికి సెలబ్రిటీలు వచ్చిన ఎపిసోడ్‌లో హౌస్ లోని కంటెస్టెంట్‌లు అందరూ చాలా డిఫరెంట్గా వారి వారి టాలెంట్ తో గెస్ట్ లను ఆకట్టుకున్నారు. మరి ఈ వారం ఎవరు హౌస్ నుండి వెళ్తారో వేచి చూడాలి.
 
అలాగే తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజన్ 6తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఇటీవలే గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తాజా సీజన్ సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా మొదలైంది. డ్యాన్స్‌తో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ తర్వాత 21 మంది కంటెస్టెంట్స్‌ను అందరికీ పరిచయం చేశాడు.
 
కాగా ఇపుడు బిగ్ బాస్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్‌కు సంబంధించిన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం టీఆర్పీ రేటింగ్ 8.86గా నమోదై… సర్‌ప్రైజింగ్‌గా అందరినీ షాక్ గురి చేస్తుందన్న వార్త ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments