Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలిగా మీట్ క్యూట్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (16:55 IST)
Meet Cute poster
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తున్న నేచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న మరో యూనిక్ ప్రాజెక్ట్ “మీట్ క్యూట్”. నాని సోదరి దీప్తి గంటా ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. “మీట్ క్యూట్” ఐదు కథలతో క్యూట్ ఎంథాలజీగా ఉండబోతోంది. ఒక కథలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. రోహిణి మొల్లేటి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచ ఫీమేల్ లీడ్స్ గా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి , దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా కథానాయకులుగా నటిస్తున్నారు.
 
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ సోనీ లివ్ ఈ ఎంథాలజీ హక్కులను పొందింది, త్వరలో ప్రత్యేకంగా ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో స్క్రీనింగ్ చేయనుంది. ఓ క్యూట్ పోస్టర్ ద్వారా మేకర్స్ అదే విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రం టీజర్‌ను రేపు విడుదల చేయనున్నారు. ఈ ఎంథాలజీ అంతా అందమైన  యాదృచ్ఛిక సంఘటనలు, గొప్ప సంభాషణలు, హార్ట్ వార్మింగ్ క్షణాల సమాహారం.
 
 ఈ ఎంథాలజీలో  ప్రముఖ తారాగణంతో పాటు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, విజయ్ బుల్గానిన్ సంగీత సమకూర్చారు.  అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా,  గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.  
 
తారాగణం - సత్యరాజ్, రోహిణి, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా
 
రచన, దర్శకత్వం: దీప్తి గంటా నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని  సమర్పణ: నాని
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా డీవోపీ: వసంత్ కుమార్సం గీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments