Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సాయి దుర్గ తేజ్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో మ్యాసీవ్ సెట్ నిర్మాణం

డీవీ
శనివారం, 21 సెప్టెంబరు 2024 (17:52 IST)
Sai Durga Tej
హీరో సాయి దుర్గ తేజ్ స్ట్రాంగ్ కంటెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. 'విరూపాక్ష', 'బ్రో' బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, రోహిత్ కెపి దర్శకుడిగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత, నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై  ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
 
SDT18 టీం ప్రముఖ ఫైట్ మాస్టర్స్ కొరియోగ్రాఫ్ చేసిన 15 రోజుల యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తి చేసింది. మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ లలో సాయి దుర్గా తేజ్ పవర్ ఫుల్ మాస్ అవతార్‌లో కనిపిస్తారు, హై-ఆక్టేన్ స్టంట్స్, డైనమిక్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయి.
 
హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాని తెరకెక్కుతోంది. నెక్స్ట్ షెడ్యూల్‌ కోసం 12 ఎకరాల్లో మ్యాసీవ్ సెట్‌ సిద్ధమవుతోంది. హై స్కేల్, ఇంటెన్సిటీతో SDT18 గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.  
 
ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments