Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌తో హీరో సాయి దుర్గ తేజ్‌ భేటి !

Advertiesment
Revanth- sai tej

డీవీ

, సోమవారం, 15 జులై 2024 (09:44 IST)
Revanth- sai tej
తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్‌ రెడ్డితో, మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్‌  ఆదివారం భేటి అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మీటింగ్‌లో మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్‌ ఎంపీ చామాల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రోహిన్‌ రెడ్డి వున్నారు. కాగా మొదట్నుంచీ సామాజిక స్పృహా వున్న హీరోల్లో సాయి దుర్గా తేజ్‌ ముందు వరుసలో వుంటారు.

webdunia
Revanth- sai tej and others
ఇటీవల 'సత్య'  అనే సామాజిక సందేశం వున్న సినిమాతో దేశ సైనికుల త్యాగాలు, వారి కుటుంబ త్యాగాలు అందరికి తెలిసేలా చేసిన సాయి దుర్గా తేజ్‌ ప్రభుత్వం తరపున చెపట్టే రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు. 
 
తాజాగా  తండ్రి, కూతురి మధ్య వున్న అనుబంధానికి మచ్చ తెచ్చేలా యూట్యూబ్‌లో ఓ వీడియోను కామెంట్‌ చేసిన వ్యవహారంలో యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు నీచ బుద్దిని సాయి దుర్గ తేజ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబ విలువలకు మచ్చ తేచ్చేలా ఫన్‌ పేరుతో చిన్న పిల్లలను ట్రోల్‌ చేస్తున్న, ప్రణీత్‌  హనుమంతు లాంటి వారిని కఠినంగా శిక్షించాలని  ట్విట్‌  చేశారు సాయి దుర్గ తేజ్‌. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి స్పందించగా, ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ప్రభుత్వం సకాలంలో తన ట్విట్ట్‌కు స్పందించిన తీరుకు కృతజ్ఞతగా సాయి దుర్గ తేజ్‌ ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసి తన అభినందనలు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన షణ్ముఖ్ జశ్వంత్!!