Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన షణ్ముఖ్ జశ్వంత్!!

shanmukh

వరుణ్

, ఆదివారం, 14 జులై 2024 (17:20 IST)
యూట్యూబ్ స్టార్, రియాలిటీ షో బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ గతంలో పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తాజాగా వెల్లడించారు. దీప్తితో బ్రేకప్, డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా చిక్కుల్లో పడి చాలాకాలంపాటు అభిమానులకు దూరంగా ఉండిపోయిన షణ్ముఖ్.. తాజాగా తాను ఎదుర్కొన్న కష్టాలు, వేధించిన ఆలోచనల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
 
మానసిక ఒత్తిడి అనే సమస్య గంటలు, రోజుల్లో తీరిపోయేది కాదని, అది చాలాకాలం పాటు వేధిస్తుందని షణ్ముఖ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. సమస్యలు ఎన్ని వేధించినా ప్రతిసారీ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నానని, ఒకసారి మనం ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రపంచంలో మన కుటుంబం తప్ప మరెవరూ పట్టించుకోరని పేర్కొన్నాడు.
 
ఏదైనా సమస్య ఉంటే దానిని ధైర్యంగా ఎదుర్కోవాలని షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. దేవుడు కష్టాలు పెట్టి పరీక్షిస్తూనే ఉంటాడని, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటేనే మనకు కావాల్సింది. దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. తన అనుభవంలో ఇవన్నీ అర్థం చేసుకున్నానని, మీరు స్ట్రాంగ్ కాబట్టి ఏదైనా చేయగలరని పేర్కొన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకుల తర్వాత నిహారిక కొణిదెల జీవితం ఎలా వుంది?