Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ ధమాకా నుండి మాస్ రాజా' లిరికల్ వీడియో విడుదల

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (18:24 IST)
taviteja mass song
మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' మేకర్స్ చార్ట్‌బస్టర్‌ 'జింతాక్‌'తో గ్రాండ్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ 'మాస్ రాజా'ను విడుదల చేశారు. 'మాస్ రాజా' టైటిల్ కి తగ్గట్టే మాస్ కి పూనకాలు తెప్పించేలా వుంది ఈ పాట.
 
భీమ్స్ సిసిరోలియో 'మాస్ రాజా' పాటని థియేటర్లు దద్దరిల్లేలా మాస్ డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేశారు. సాంగ్ వీడియోలో రవితేజ డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయి. తన గ్రేస్ ఫుల్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేశారు రవితేజ.ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మాస్ కి డబుల్ ఇంపాక్ట్ ని ఇచ్చింది.
 
♫ బడా ఎంటర్ టైన్మెంట్ వాలా ఆగయా
బిసి సెంటర్లో మోగాలి తాలియా
బాడీ లోకల్ .. మైండే గ్లోబల్
క్లాసు మాసు కాంబో మోడల్
బోలో ఎవ్రీ బాడీ ప్యార్ సే
బోలో ఎవ్రీ బాడీ జరా జోర్ సే
ఏతో మాస్ మాస్ రాజా.. జరా ఉఠాకే మార్ బ్యాండ్ బాజా♫
 
మాస్ మహారాజా ఇమేజ్ తగ్గట్టు సాగిన ఈ లిరిక్స్ మళ్ళీమళ్ళీ వినాలనిపించేలా వున్నాయి. నకాష్ అజీజ్ఈ పాటని ఫుల్ గ్రేస్ తో ఎనర్జీటిక్ గా పాడారు. ఫస్ట్ సింగిల్ గా వచ్చిన 'జింతాక్‌' సాంగ్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. ఇప్పుడు మాస్ రాజా పాట కూడా మాస్ చార్ట్‌బస్టర్‌ హిట్ ని అందుకుంది.
 
పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజకు జోడిగా టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల సందడి చేయనుంది.
 
 నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments