Webdunia - Bharat's app for daily news and videos

Install App

యావరేజ్ స్టూడెంట్ నాని నుంచి మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ ‘రాలే పువ్వే’ విడుదల

డీవీ
మంగళవారం, 30 జులై 2024 (17:56 IST)
Rale puvve song
మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా పవన్ కుమార్ కొత్తూరి సక్సెస్ అందుకున్నారు. డైరెక్టర్‌గా సక్సెస్ అయిన పవన్ కుమార్.. ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. రెండో ప్రాజెక్టుతో ఆయన హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. 
 
ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. వరుసగా కంటెంట్‌ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే పాటలు, టీజర్, పోస్టర్ అంటూ బజ్ క్రియేట్ చేశారు. తాజాగా మంచి మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ ఉన్న పాటను విడుదల చేశారు. 
 
రాలే పువ్వే అంటూ అదిరిపోయే పాటను తాజాగా రిలీజ్ చేశారు. కార్తీక్ బి కొడకండ్ల అందించిన క్యాచీ ట్యూన్‌.. భువనేశ్వర్ రాగిఫణి సాహిత్యం.. లక్ష్మీ శ్రావణి, కార్తీక్ బి కొడకండ్ల గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.  రాజ్ పైడి మాస్టర్ స్టెప్పులు కుర్రకారును కట్టిపడేసేలా ఉన్నాయి. హీరోయిన్లు స్నేహా, సాహిబా అందాలకు కుర్రకారు ఫిదా అవ్వడం గ్యారెంటీ.
 
ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ సినిమాకి ఎడిటర్.
 
నటీనటులు: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రుషికొండ ప్యాలెస్.. ఒక్క బాత్‌టబ్‌కు రూ.36 లక్షలు.. చంద్రబాబు షాక్ (video)

జగన్‌తో లాభం లేదు.. టీడీపీతో పొత్తు.. బాబుతో కేసీఆర్, కేటీఆర్ భేటీ?

మరో వివాదంలో బీఆర్ నాయుడు.. తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఓవైసీ

దీపావళి నాడు కుక్క తోకకి చిచ్చుబుడ్డి కట్టి వెలిగించి హింస (video)

పవన్‌ను ప్రసన్నం చేసుకున్న బాబు.. బలైన వర్మ.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments