Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటెంట్ బేస్డ్ భారీ ప్రాజెక్టులతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దూకుడు

డీవీ
మంగళవారం, 30 జులై 2024 (17:51 IST)
TG Vishwa Prasad
హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లు, కంటెంట్-బేస్డ్ చిత్రాలకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అడ్డాగా మారింది. విజనరీ ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ తన టేస్ట్‌కు తగ్గట్టుగా అన్ని రకాల జానర్లలో అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న రాబోతోంది. తాజాగా టీజర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
 
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మరో అద్భుతమైన చిత్రం రాజా సాబ్ రాబోతోంది. దర్శకుడు మారుతి ఇటీవలే ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు.ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ అద్భుతమైన కొత్త లుక్‌లో కనిపించారు. గ్లింప్స్‌కి పాజిటివ్ రియాక్షన్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
 
టీజీ విశ్వ ప్రసాద్ ప్రస్తుతం తన ప్రొడక్షన్ కంపెనీ లైనప్‌ను ఇంట్రెస్టింగ్‌గా మలిచారు. తేజ సజ్జతో మిరాయ్, అడివి శేష్‌తో G2 వంటి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆకర్షణీయమైన కథనాలను రూపొందించడంలో, విభిన్న కథాకథనాలను అన్వేషించడంలో నిర్మాణ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది.
 
అంతేకాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవలె సన్నీ డియోల్, గోపీచంద్ మలినేనిల డైనమిక్ కాంబినేషన్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. స్టార్ హీరోలు, స్టార్ క్యాస్టింగ్‌తో అద్భుతమైన కంటెంట్-సెంట్రిక్ మూవీస్‌లను నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments