Webdunia - Bharat's app for daily news and videos

Install App

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

దేవీ
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (19:48 IST)
Pavan kalyan -Mark
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఓ ప్రకటన విడుదల చేశారు.
 
మా అబ్బాయి క్రమంగా కోలుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ, చంద్రబాబుగారు నాకు ధైర్యం నూరిపోశారు. సింపూర్ లో అవసరైన వైద్య సౌకర్యాలు కల్పించాలని అక్కడి హై కమీషన్ కు దిశానిర్దేశం చేశారు. వారికి నాహ్రుదయ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా,

ఈ సందర్భంగా దేశంలోనూ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నా బాబు ఆరోగ్యం వాకబు చేశారు. ఇందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ మాద్యమాల ద్వారా న్యాయమూర్తులు, రాజకీయనాయకులు, సినీరంగ ప్రముఖులు, ఎం.ఎల్.ఎ.లు, ఎంపి.పీలు, లెజిస్టేటర్లు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మార్క్ కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి ఆశీస్సులతో కోలుకుంటున్నందుకు అందరికీ మనస్పూర్తిగా క్రుతజ్నతలు తెలియజేస్తున్నాను..అని పవన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments