Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓల్డ్ న్యూస్‌‌గా మారిన ఐటమ్ సాంగ్స్.. ప్రేక్షకుల్లో మార్పొచ్చింది: మనోజ్ బాజ్‌పేయి

Webdunia
మంగళవారం, 3 మే 2016 (17:55 IST)
జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఐటమ్ సాంగ్స్‌పై నోరు విప్పారు. ఐటమ్ సాంగ్స్ ప్రస్తుతం ఓల్డ్ న్యూస్‌గా మారిపోయాయనని అభిప్రాయపడ్డారు. మొన్నటివరకు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కచ్చితంగా ఉండాల్సిందని అందరూ అనుకునేవారు. ఆ పాటలు సైతం కథలకు అనుగుణంగా లేకుండా స్క్రిప్ట్‌కు ఇబ్బంది కలిగించేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందని బాజ్‌పేయ్ అంటున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీకి శుభపరిణామని చెప్పుకొచ్చారు. 
 
ప్రేక్షకుల ఆలోచనా విధానంలో మార్పు రావడం కారణంగా వారు ప్రయోగాత్మక, వాస్తవికతకు దగ్గర గల సినిమాలపై ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు సంతోషకరమని.. వాస్తవికతపైనే అభిమానులు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ప్రేక్షకుల్లో పరిపక్వత వచ్చిందని, హాలీవుడ్‌లోనూ వాస్తవికతకు అనుగుణంగా సినిమాలొస్తున్నాయన్నారు. తన లేటెస్ట్ సినిమా ట్రాఫిక్ గురించి మనోజ్ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ను మలయాళంలో చూసానని, తప్పకుండా బ్లాక్‌బస్టరేనని తెలిపారు. థ్రిల్లర్ అయిన ట్రాఫిక్ ఓ నిజమైన కథతో తెరకెక్కిందన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telugu Compulsory: తెలుగు తప్పనిసరి- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఐటీ నగరం బెంగుళూరులో రెడ్ అలెర్ట్ ... ఎందుకో తెలుసా?

Nara Lokesh: దళితులకు గుండు కొట్టించి, వారిని చంపి డోర్ డెలివరీలు చేసిన వారు మీరే! (video)

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

Amit Shah: తమిళం మాట్లాడలేకపోతున్నా సారీ: అమిత్ షా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments