Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ జనంలో వున్నాడు.. పవన్ చెప్పిన మాటపై నిలబడతాడు‌.. నా చివరి సినిమా అదే... దాసరి ఇంటర్వ్యూ

దాసరి నారాయణరావు. ఇండస్ట్రీలో పెద్ద దిక్కు.. అయితే సినిమా దర్శకుడిగా.. ప్రసుత్తం వెనకడుగు వేస్తున్నారు. అందుకు కారణం.. తాను బాగా నమ్మి తీసిన రెండు చిత్రాలు నిరాశపర్చాయని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయినా... జనాలు ఎందుకనో సినిమాలు చూడలేదు. అ

Webdunia
మంగళవారం, 3 మే 2016 (17:27 IST)
దాసరి నారాయణరావు. ఇండస్ట్రీలో పెద్ద దిక్కు.. అయితే సినిమా దర్శకుడిగా.. ప్రసుత్తం వెనకడుగు వేస్తున్నారు. అందుకు కారణం.. తాను బాగా నమ్మి తీసిన రెండు చిత్రాలు నిరాశపర్చాయని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయినా... జనాలు ఎందుకనో సినిమాలు చూడలేదు. అలాగే ప్రేమ అనేది పవిత్రం.. దాన్ని కామంగా చూపిస్తున్నారు. ఇది యూత్‌పై ప్రభావాన్ని చూపుతుందని అంటున్న దాసరి నారాయణరావు పుట్టినరోజు ఈ బుధవారమే. మే 4. 1972లో 'తాతా మనవడు' సినిమాతో తెలుగుతెరకు దర్శకుడిగా పరిచయమైన దాసరి నారాయణరావు, సుమారుగా 150 సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకరత్న పేరు సార్థకం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ..
 
బరువు తగ్గారే?
డైట్‌ చేసి సుమారుగా 15 కిలోలు తగ్గాను.
 
పవన్‌తో సినిమా  వుందని.. లేదని వార్తలు విన్పిస్తున్నాయి?
మొదట్లో నేనే ప్రకటించాను. పవన్‌ వెంటనే స్పందించలేదు. నాకూ ఆయనకూ తెలుసు సినిమా గురించి.. అందుకే నెగెటివ్‌గా ప్రచారం కూడా జరిగిపోయింది. కథ సిద్ధంగా ఉంది. త్రివిక్రమ్‌ కూడా పని చేస్తున్నాడు. అయితే డైరెక్టర్‌ ఎవరనే విషయాన్ని సస్పెన్స్‌గా పెట్టాం.
 
మీ బేనర్‌లో కొత్తవారితో చేస్తానన్నారు?
అవును. స్వర్గం నరకం తీసినట్లే అందరూ కొత్తవారితో తీస్తాను. మొత్తం మూడు సినిమాలు పట్టాలెక్కించాలనుకుంటున్నాం. అందులో అందరూ కొత్తవాళ్ళతో నేనొక సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నాను. పూర్తిస్థాయి ప్రేమకథగా ఆ చిత్రం ఉంటుంది. మిగిలిన రెండు సినిమాలకు ఎవరైనా దర్శకత్వం చేయొచ్చు. అవి త్వరలో వివరిస్తాను.
 
ఇప్పటి ప్రేమకథలు ఎలా వున్నాయని భావిస్తున్నారు?
ప్రేమ కథల్లో మారిన ట్రెండ్‌, మారని ట్రెండ్‌ రెండు ఉంటాయి. ప్రేమ అంటే కామం కాదు. మనిషి కనిపించగానే 'ఐ లవ్‌ యు' చెప్పే కథలు నేను తీయను. యూత్‌కు బాగా దగ్గరగా ఉండే కథను రూపొందిస్తున్నాను. ఓ చక్కటి కథ నేను ఇప్పుడు రాసుకుంది కాదు. కొన్నేళ్ళ క్రితం రామానాయుడుగారితో కలిసి తీయాలని రాసుకున్న కథ. కాని ఆయన అనారోగ్య కారణంగా చేయలేకపోయాం. రామానాయుడుకి బాగా నచ్చిన కథ.
 
మహాభారతం మీరు తీస్తున్నట్లు తెలిసింది?
అవును. మహాభారతాన్ని ఐదు భాగాలుగా తీయాలనేది నా ప్లాన్‌. ఇప్పటికే రెండు పార్ట్స్‌ పూర్తయ్యాయి. మూడో భాగాన్ని సిద్ధం చేస్తున్నాను. ఎవరో మహాభారతం సినిమాను తీయబోతున్నారని విన్నాను. కాని నేను మాత్రం తీయకుండా ఉండను. దర్శకుడిగా నేను పని చేసే చివరి సినిమా ఇదే అవుతుంది.
 
నటుడుగా కన్పించరా?
నేను సినిమాల్లో నటించడానికి దూరంగా లేను. కొంచెం గ్యాప్‌ తీసుకున్నాను అంతే. నేను చేసిన బెస్ట్‌ మూవీ 'పరమవీరచక్ర' ఫెయిల్‌ అవ్వడం. మంచి పాత్ర, మంచి పెర్ఫార్మన్స్‌ చేసిన 'ఎర్రబస్సు' చిత్రాలు నన్ను నిరాశపరిచాయి. గ్యాప్‌ తీసుకోవడానికి కారణం కూడా అదే.
 
ప్రేక్షకుల ఆలోచనా ఎలా వుందంటారు?
ప్రేమ అంటే తల్లితండ్రులను తిట్టడం, వెటకారంగా, ఎగతాలిగా మాట్లాడడం కాదు. అలా చేస్తే సినిమాలు చూడటం మానేశారు. గత రెండు సంవత్సరాలుగా ఆరోగ్యకరమైన చిత్రాలను మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు. 'భలే మంచి రోజు', 'సినిమా చూపిస్తా మావ', కళ్యాణ వైభోగమే, క్షణం, 'ఊపిరి' వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. సినిమాలో ఆరు ఫైట్లు, ఆరు పాటలు ఉంటే ప్రేక్షకులు చూస్తారనుకుంటే పొరపాటే.
 
ఇటీవలే నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు హీరోలను దర్శకులను వెనక్కు ఇవ్వమంటున్నారు. గతంలో వుందా?
ఇది ఇప్పటిదికాదు. గతంలోనూ వుంది. గతంలో.. నలభై ఏళ్ళ క్రితం డిస్ట్రిబ్యూటర్స్‌ పిలిచి సినిమాలకు ఫైనాన్స్‌ ఇచ్చేవారు. బయ్యర్స్‌ నష్టపోతే హీరోలు చేయబోయే తదుపరి సినిమాలో రాయితీ ఇచ్చేవారు. ఈ పద్ధతి ఎప్పటినుండో ఉంది. కొత్తగా వచ్చింది కాదు. హీరో, డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా హిట్‌ అయితే వారి చేయబోయే నెక్ట్స్ సినిమాను ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి కొనుక్కుంటారు. 
 
అలాంటప్పుడు ఆ సినిమాకు ఇరవై, ముప్పై శాతం నష్టం వస్తే దర్శక నిర్మాతలు, హీరోలు ఏమి చేయనక్కర్లేదు. అదే సినిమా డిజాస్టర్‌ అయితే మాత్రం కొంత నష్టాన్ని పూడ్చాలి. గతంలో రజినీకాంత్‌, అల్లు అరవింద్‌ ఈ విధంగానే ఇచ్చారు. ఈమధ్య కాలంలో పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, వినాయక్‌, శ్రీను వైట్ల కూడా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బు ఇచ్చారు. మనల్ని నమ్మి సినిమా కొంటున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. డబ్బు అడగడమూ తప్పు కాదు. ఇవ్వడమూ తప్పు కాదు.. అలాగనీ బజారున పడటం కరెక్ట్‌ కాదు.
 
ఇండస్ట్రీ డే గురించి రామ్‌ లక్ష్మణ్‌లు ప్రతిపాదన చేశారు?
ఈమధ్యనే రామ్‌ లక్ష్మణ్‌లు ఇండస్ట్రీలో 'సినిమా డే' అనేది ఉండాలని ప్రపోజల్‌ పెట్టారు. నిజానికి 1932లో 'భక్త ప్రహ్లాద' సినిమా రిలీజ్‌ అయింది. ఆ రోజునే తెలుగు సినిమా పుట్టినరోజుగా చాలాకాలం జరుపుకున్నాం. కాని రాను రాను అది మరుగునపడింది. రామ్‌ లక్ష్మణ్‌లు చెప్పిన ఆలోచన నాకు నచ్చింది. వందశాతం దానికి కృషి చేస్తాను.
 
హైదరాబాద్‌లో సినిమా అభివృద్ధి అవుతుందా? వెనక్కు వెళుతుందా?
సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలని ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగు పరిశ్రమను డెవలప్‌ చేయొచ్చు. దానికోసం ఇండస్ట్రీను షిఫ్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సినిమాలు ఎక్కడైనా తీయొచ్చు. ఆ టెక్నాలజీ వచ్చేసింది. అలానే సినిమాకు సంబంధించిన కొన్ని ఫంక్షన్స్‌ను ఫలానా చోటే చేయాలనే డిమాండ్‌ లేదు. ఎక్కడైనా చేసుకోవచ్చు. గతంలో వైజాగ్‌, విజయవాడ, తిరుపతి ఇలా చాలాచోట్ల చేసేవాళ్ళం. హైదరాబాద్‌ను సినిమా హబ్‌ చేయాలి. దీని కోసం తమిళ, కన్నడతోపాటు బాలీవుడ్‌ ఇండస్ట్రీ కూడా ఇక్కడకు రావాలి. దీనికి సుమారుగా 2000 ఎకరాల్లో సినిమా హబ్‌ను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం దీనికి కమిటీ వేసి మా సలహాల కోసం పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను.
 
5వ ఆట లాభమా? నష్టామా?
చిన్న చిత్రాలను థియేటర్స్‌ సమస్యలు వస్తున్నాయి. అందుకే రోజు నాలుగు ఆటలు ఉండే సినిమాను ఐదు ఆటలుగా మార్చాలని ప్రతిపాదిస్తున్నాం. ప్రత్యేకంగా నాలుగు గంటల షోను చిన్న చిత్రాలకు కేటాయించాలని డిసైడ్‌ అవుతున్నాం. అలా చేయకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే దానికి ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ కావాలి. చిన్న ఊరులో ఉన్న థియేటర్లకు కూడా ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ రావాలి. ఇలా చేయడానికి ప్రభుత్వం సిద్ధ పడింది.
 
వైఎస్‌.. జగన్‌ పార్టీలో చేరుతారనే వార్తలు విన్పిస్తున్నాయి?
నాకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. 1978 నుండే ఆయన నాకు తెలుసు. ఆయనకు నాకు ఉన్న స్నేహంతోనే జగన్‌ నాతో మాట్లాడానికి వచ్చాడు. నిత్యం జనాల్లో ఉండే మనిషి జగన్‌. ఏదో సాధించాలనే తత్వం గలవాడు. నా సపోర్ట్‌ ఎప్పటికి తనకు ఉంటుంది. నేను 2019 ఎన్నికల్లో 'వైఎస్‌ఆర్‌ సిపి' పార్టీలో చేరుతాననే వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ప్రస్తుతం రాజకీయ ఆలోచనలు లేవు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల వలన నేను రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు. అవి వ్యాపార వ్యవస్థగా మార్చుకుంటున్నారు. నాలా సూటిగా ఉండేవారు రాజకీయాలకు పనికి రారు. వెళ్ళినా.. బురద చల్లించుకొని రావాలి. 
 
ఆంధ్రకు ప్రత్యేక హోదా వుందంటారు. లేదంటారు.. అసలు ఏమి జరుగుతుంది?
అది ప్రజలు, ప్రతిపక్షాలే గట్టిగా అడగాలి. వుందని చెప్పినప్పుడు లేదని ఎలా అంటారు.. అసలు సెపరేట్‌ చేసినప్పుడు ఏంచేశారు? ఎలా చేశారు? అనేది ప్రజాస్వామ్యంలో తెలియాలి కదా.. ఇదేం రాజులపాలన కాదుగా.. ఏమీ తెలీకుండా.. దాచడానికి... ఏదిఏమైనా.. ప్రత్యేక హోదా.. ఇవ్వలేకపోవడం, పార్లమెంట్‌లో కూడా ఎంఓఎస్‌ ప్రత్యేక హోదా లేదని చెప్పడం భాధాకరం. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. పోయిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాలి. లేదంటే భవిష్యత్తు తరాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది.
 
మీరు చెప్పినా పరభాషా నటులు తగ్గలేదే?
నేను చాలాసార్లు చెప్పాను. కానీ కాంబినేషన్స్‌ వచ్చిన తరువాత ఇతర భాషల నుండి నటులను తెచ్చుకొని సినిమా చేస్తే పెద్ద ప్రాజెక్ట్‌ అవుతుందని ఆలోచించడం తప్పు. మన దగ్గర ఆర్టిస్ట్స్‌ లేరనుకోవడం పొరపాటు. వెతికి పట్టుకోవాలి. తప్పనిస్థితిలో వారిని దిగుమతి చేసుకోవడంలో తప్పు లేదు.
 
పవన్‌ రాజకీయాల్లోకి వస్తే.. నిలబడతాడా?
పవన్‌ కళ్యాణ్‌ కమిట్మెంట్‌, డెడికేషన్‌ ఉన్న మనిషి. తను చెప్పిన మాటకు నిలబడతాడు. అలాంటి మనిషి రాజకీయ ప్రవేశం చేయడం ఆనందకరం. అయితే త్వరలోనే సినిమా మానేస్తానని చెప్పాడు. బాధ్యతలు తీసుకున్నప్పుడు రెండు పడవల మీద ప్రయాణం చేయకూడదనేది నా భావన.
 
పేపర్‌ అన్నారు. ఛానల్‌ అన్నారు. అవి ఏమయ్యాయి?
న్యూస్‌ పేపర్‌, చానల్‌ పెట్టాలనే ఆలోచన అయితే ఉంది కాని చేసే మనుషులు ఎవరున్నారా..? అని ఆలోచిస్తున్నాను.
 
సినిమా విజయాలు శాతం తగ్గడానికి కారణం?
సినిమా సక్సెస్‌ రేట్‌ అనేది తగ్గడానికి కారణం అనుభవం లేని నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. ఇదివరకు నిర్మాత అనేవాడికి ప్రతి ఒక్కదానిపై అవగాహన ఉండేది. ఇప్పుడున్న ఏ ఒక్క నిర్మాతకు కూడా స్క్రిప్ట్‌ ఏంటో కూడా తెలియదు. అనుభావరాహిత్యంగా సినిమాలు చేస్తున్నారు.. అని ముగించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments