Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయను.. మన్మథుడు-2

Webdunia
గురువారం, 25 జులై 2019 (12:40 IST)
మన్మథుడు-2 నుంచి ప్రస్తుతం వినోదాత్మక ట్రైలర్ విడుదలైంది. కింగ్ నాగార్జున హీరోగా నటించి హిట్టైన మన్మథుడుకి ఇది సీక్వెల్. ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాగార్జున సరసన నాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ వైరల్ అవుతోంది. 
 
ఈ ట్రైలర్‌లో సినిమాలోని ప్రధాన పాత్రలను కవర్ చేశారు. ఈ ట్రైలర్ కొంత వినోదభరితంగానూ, మరికొంత ఉద్వేగభరితంగాను సాగింది. ''ఏ అమ్మాయ్ బాగానే వున్నావ్ గదా .. వీడ్ని చేసుకుంటున్నావేంటి?'' అనే రావు రమేశ్ డైలాగ్, "నువ్వు ఒంటరిగా ఉండటమే కరెక్ట్ .. నీతో ఎలాగో ఎవరూ ఉండలేరు" అనే రకుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 
ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవా అంటే ఒక్క పూట భోజ‌నం కోసం నేను వ్య‌వ‌సాయం చేయ‌నంటూ సెటైర్ వేసాడు నాగార్జున‌. అంతేకాదు నా జీవితం నా కోస‌మే నేను పిల్ల‌ల‌ను క‌న‌ను అంటూ మ‌రో న్యూస్ కూడా చెప్పాడు. ఓ వైపు కామెడీ మ‌రోవైపు రొమాన్స్ ఇంకోవైపు సెంటిమెంట్.. ఇలా ప్ర‌తీ ఒక్క‌టి మిక్స్ చేసి ఈ ట్రైల‌ర్ విడుదల చేసాడు ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్. 
 
వెన్నెల కిషోర్‌తో వ‌చ్చే సీన్స్ కూడా చాలా ఫ‌న్నీగా అనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో నాగార్జున లిప్‌లాక్ సీన్స్ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఇక రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments