శ్రీదేవి సోడా సెంటర్ లో మందులోడా మాయ‌లోడా.. ఫోక్‌సాంగ్ వ‌చ్చేసింది

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (11:59 IST)
Fock song
సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలోని `మందులోడా మాయ‌లోడా..` అనే ఫోక్ సాంగ్‌ను శుక్ర‌వారం ఉద‌య‌మే మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మాస్ సాంగ్ ఊపు ఊపేలా వుంద‌ని కితాబిచ్చారు. 
 
కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఈ డ్యాన్స్ నంబర్ ప్రస్తుతం మాస్ ఆడియన్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ఈ పాట‌కు మణిశర్మ సంగీతం అందించారు. సాహితీ చాగంటి, ధనుంజయ ఈ మాస్ సాంగ్ కు గాత్రం చేశారు.
 
 ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో పావెల్ నవగీతం, నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష్ వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments