Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

ఠాగూర్
శనివారం, 24 మే 2025 (13:01 IST)
మా డాడీ మంచు మోహన్ బాబు కాళ్లు పట్టుకోవాలని వుందని, తన కుమార్తెను ఆయ మడిలో కూర్చోబెట్టాలని ఉందని హీరో మంచు మనోజ్ అన్నారు. తమ కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన తాజాగా స్పందించారు.
 
"తొమ్మిదేళ్లుగా నా పని నేను చేసుకునిపోతున్నా. నా భార్య బొమ్మల తయారీ కంపెనీ ప్రారంభించింది. దానికి నేను ఆర్ట్ వర్క్ చేశా. కథలు రాశా. ఆత్మగౌరవంతో బతికా. నేను ఎలాంటివాడినో ఇండస్ట్రీలోనే కాదు బాహ్య ప్రపంచంలోనూ ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, నాకు ఊహించని విధంగా ముప్పు ఎదురైంది. నిస్సహాయస్థితిలో ఉన్న కారణంగానే మీడియా ముందుకు వచ్చా. నా సతీమణి గర్భంతో ఉన్న సమయంలో మళ్లీ కలిశాం. అది మా కుటుంబంలోని ఒకరికి నచ్చలేదు. 
 
మరోవైపు, కాలేజీలోని కొన్ని సమస్యలు గురించి పెద్దాయన వరకూ వెళ్ళడం లేదంటూ కొందరు విద్యార్థులు నాకు లేఖలు ఇచ్చారు. ఇది తెలుసుకున్న ఆ వ్యక్తి... నీకేంటి సంబంధం? అనే మాట వచ్చింది. ఆ తర్వాత అక్కడ పనిచేసేవారితో కలిసి నాపైనా, నా భార్యపైనా కేసులు పెట్టించారు. సంబంధం లేదని విషయంలో నా భార్యను లాగారు. అపుడు నా హృదయం ముక్కలైంది. తనకు అన్నీ నేనే. నేను ఏ తప్పూ  చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. గొడవ పెట్టుకోలేదు. నాకు ఆవేశం ఉది. 
 
బాధతో వచ్చిన కోపం అది. వెళ్లి నాన్న కాళ్ళుపట్టుకోవాలని వుంది. నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికీ ఉంది. కానీ, చేయని తప్పుని అంగీకరిస్తే? నా పిల్లలకు నేనేం నేర్పిస్తా.. మా మాన్న నేర్పించిన నీతి ఇది. అందుకే నేను ముందుకు వెళ్లలేకపోతున్నాను. మేమంతా మళ్లీ కలిసివుండే రోజు రావాలని ఆ దేవుడుని ప్రార్థిస్తున్నా.. సమస్యలు సృష్టించినవారు తమ తప్పును తెలుసుకుంటారనే నమ్మకం ఉంది" అని మంచు మనోజ్ తన మనసులోని బాధను వెళ్లగక్కారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments