Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రణతితో విబేధాలా? విడాకులా? వాళ్ల బొంద: మంచు మనోజ్

భార్య ప్రణతికి మధ్య విభేదాలు వచ్చాయని ఆమెతో విడాకులు తీసుకునేందుకు సినీ నటుడు మంచు మనోజ్ సిద్ధంగా వున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై మంచు మనోజ్ స్పందించాడు. తన భార్య తనకు సర్

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (09:40 IST)
భార్య ప్రణతికి మధ్య విభేదాలు వచ్చాయని ఆమెతో విడాకులు తీసుకునేందుకు సినీ నటుడు మంచు మనోజ్ సిద్ధంగా వున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై మంచు మనోజ్ స్పందించాడు. తన భార్య తనకు సర్వస్వమని.. ఆమెను దూరం చేసుకోవట్లేదని స్పష్టం చేశాడు.


ఇంకా విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన అభిమానులతో చాట్‌ చేశాడు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాడు. విడాకులు తీసుకునే ప్రసక్తే లేదని, ప్రణతి తన దేవతని చెప్పాడు. ''వాళ్ల బొంద. రూమర్స్ పుట్టించేవాళ్లకు ఏం తెలుసు మా గురించి'' అంటూ సమాధానమిచ్చాడు. 
 
కాగా, ఓ అభిమాని ట్వీట్‌ చేస్తూ... తనకు ఒక రిప్లై ఇవ్వాలని, రిప్లై కోసం చూసీ చూసీ కోపంతో ఫోన్‌ పగలగొట్టేలా ఉన్నానన్నాడు. దానికి మనోజ్‌ సమాధానం ఇస్తూ నో కోపం.. లవ్యూ అంటూ తెలిపాడు. కులం పేరుతో కొందరు రాజకీయ నేతలు మన దేశాన్ని విభజించాలని చూస్తున్నారని చెప్పాడు. మన కర్మ... బ్రిటిషర్లు మనకు డివైడ్‌ అండ్‌ రూల్‌ పాలసీని బాగా నేర్పించి వెళ్లారని కామెంట్  చేశాడు. 
 
ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే.. గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు చిత్రాల తరువాత ఇప్పుడు ఓ ప్రేమ కథా చిత్రం చేయబోతున్నారట. త్వరలో ఆ చిత్రానికి సంబంధించిన విషయాలను పంచుకుంటానన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments