Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుష్టశక్తిపై పోరాడే శక్తిగా మంచు లక్ష్మి ఆదిపర్వం చిత్రం

డీవీ
మంగళవారం, 8 అక్టోబరు 2024 (14:55 IST)
Manchu Lakshmi
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "ఆదిపర్వం". కీలక పాత్రను ఆదిత్యం ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా "ఆదిపర్వం" చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. "ఆదిపర్వం" సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
 
నేడు మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా "ఆదిపర్వం" చిత్రంలో ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటోంది. ఇప్పటిదాకా మంచు లక్ష్మి చేయని, ఓ సరికొత్త పాత్రలో ఆమె ప్రేక్షకులను అలరించబోతున్నారు.
 
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, నేను అనుకున్న స్థాయిలో ఒక గొప్ప చిత్రంగా "ఆదిపర్వం" ను మలిచానన్న సంతృప్తి మిగులుతోంది. మంచు లక్ష్మి, ఆదిత్యం ఓం, శివ కంఠమనినేని, ఎస్తేర్ పాత్రలకు జనం నీరాజనం పలుకుతారు. వాళ్ల పర్ ఫార్మెన్స్ మెమొరబుల్ గా ఉంటాయి. 1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా ఈ సినిమాను రూపొందించాను. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. ఇలాంటి మూవీ ఈ మధ్య కాలంలో రాలేదు. మా మూవీలో గ్రాఫిక్స్ హైలైట్ అవుతాయి అన్నారు.
 
సహ నిర్మాత గోరెంట శ్రావణి మాట్లాడుతూ - మంచు లక్ష్మి గారికి హ్యాపీ బర్త్ డే చెబుతున్నాం. ఆదిపర్వం తెలుగు చిత్రాల్లో ఒక గొప్ప ప్రయత్నంగా ప్రశంసలు దక్కించుకుంటుందని ఆశిస్తున్నాం. మూవీ  టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరికీ గుర్తుండే ఒక మంచి సినిమాగా ఆదిపర్వం ఉంటుంది. ఫైట్స్, గ్రాఫిక్స్ కు  మీ ప్రశంసలు దక్కుతాయి. అన్నారు.
 
నటీనటులు - మంచు లక్ష్మి, ఆదిత్యం ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్,  జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి క్రాంతి , మధు నంబియార్, బీఎన్ శర్మ, బృంద, స్నేహ అజిత్, అయోషా, జ్యోతి, దేవి శ్రీ ప్రభు, శ్రావణి, గూడా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, రవి రెడ్డి, లీలావతి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీరామ్, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments