Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా మొఘ‌ల్ రామోజీరావు చేతుల మీదుగా 'మనలో ఒక్కడు' టీజ‌ర్ రిలీజ్

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన 'మ‌న‌లో ఒక్కడు' టీజ‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘ‌ల్ రామోజీరావు విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (17:03 IST)
ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన 'మ‌న‌లో ఒక్కడు' టీజ‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘ‌ల్ రామోజీరావు విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జి.సి.జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్.రెడ్డి కథానాయికగా న‌టించారు. 
 
ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ మా సినిమా మీడియా నేప‌థ్యంలో సాగుతుంది. మా టీజ‌ర్‌ను మీడియా మొఘ‌ల్ రామోజీరావు విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ పూర్త‌యింది. కృష్ణ‌మూర్తి అనే సామాన్య అధ్యాప‌కుడి క‌థ ఇది. కొన్ని య‌ధార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లుకున్నాం అని అన్నారు.
 
నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ రామోజీరావుగారి చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌ల కావ‌డం మా అదృష్టం. ఆయ‌న టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా మా యూనిట్ స‌భ్యుల్ని ఆశీర్వ‌దించారు. ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. ఈ నెల 27వ తేదీన పాట‌ల్ని విడుద‌ల చేస్తాం. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం అని చెప్పారు. 
 
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ రామోజీరావు స‌మ‌క్షంలో చిత్ర టీజ‌ర్ విడుద‌లైనందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నేను చాలా మంచి పాత్ర‌లో న‌టించాను. త‌ప్ప‌కుండా అంద‌రినీ అల‌రించ‌డ‌మే కాకుండా ఆలోచింప‌జేసే సినిమా అవుతుంది అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు జెమిని సురేశ్‌, కెమెరామెన్ ఎస్‌.జె.సిద్ధార్థ్‌, స‌హ నిర్మాత‌లు ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్రియేటివ్ హెడ్ గౌత‌మ్ ప‌ట్నాయ‌క్‌, గేయ ర‌చ‌యిత పుల‌గం చిన్నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments