Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌందర్య బాల.. నిన్ను చూస్తే చాలు.. నాకు డాష్ డాష్ డాష్.. అంటూ..?

Webdunia
మంగళవారం, 18 మే 2021 (18:50 IST)
soundarya
కోలీవుడ్‌కి చెందిన టెలివిజన్ నటి, సూపర్ సింగర్ షో ఫేమ్ సౌందర్య బాల నందకుమార్‌ సీరియల్స్‌లోనే కాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ 'కబాలి', ఇళయ దళపతి విజయ్ 'మాస్టర్' వంటి చిత్రాలలో కూడా నటించింది. ఈ నేపథ్యంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 
 
ఓ ప్రొఫెసర్ తన పట్ల ప్రవర్తించిన వక్రబుద్ధిని పోస్టు చేసింది. ఇన్‌స్టాగ్రమ్‌లో ''నువ్వంటే ఇష్టం.. నా కోరిక తీరిస్తే.. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నిన్ను చూస్తే చాలు.. నాకు ****'' అంటూ ప్రొఫెసర్ అసభ్యకరంగా చేసిన చాటింగ్ యొక్క స్ర్కీన్ షాట్‌ని.. సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇలాంటి వెధవలను ఏం చేయాలి? ఖచ్చితంగా దీనికి అతను మూల్యం చెల్లించాలి అని ఫైర్ అయింది. ఇలాంటి ప్రొఫెసర్ ఉన్న కాలేజీలో ఉన్న అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
 
''ఒక మహిళతో ప్రొఫెసర్ మాట్లాడే విధానం ఇది. సిగ్గుచేటు. అతని ప్రొఫైల్‌ చూస్తే మధురైకి చెందిన ప్రొఫెసర్ అని అర్థమవుతుంది. కాలేజ్‌లో అతని చుట్టూ ఉండే బాలికలు జాగ్రత్తగా, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను..'' అని తెలిపిన సౌందర్య.. దీనికి అతను తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తానని పేర్కొంది. 
 
ప్రస్తుతం ఆ వ్యక్తిని ట్రాక్ చేస్తున్నానని, అతని గురించి అన్ని వివరాలు సేకరించి అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలియజేసింది. సౌందర్య తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్‌పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.. అంత ఆహారం వృధా అవుతుందా...

ముగిసిన నైరుతి రుతుపవన సీజన్ - కరువు ఛాయలు పరిచయం చేసి... చివరకు భారీ వర్షాలతో...

ఇసుక అక్రమ రవాణాపై ఉప్పందించాడనీ కాళ్లు చేతులు విరగ్గొట్టిన వైకాపా మూకలు

పెద్దలు పెళ్లిక ఒప్పుకోలేదని తనువు చాలించిన ప్రేమజంట... ఎక్కడ?

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments