Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి జయచిత్రకు చేతబడి చేసిన కారు డ్రైవర్

విక్టరీ వెంకటేష్ - మీనా జంటగా నటించిన చిత్రం "అబ్బాయిగారు". ఈ సూపర్ హిట్ మూవీలో హీరోకు పిన్నిగా నటించిన నటి జయచిత్ర. ఈమెకు కారు డ్రైవర్ చేతబడి చేశాడు. పైగా, ఆమె ఇంటిని నకిలీ పత్రాలు సృష్టించి తన ఆధీనం

Webdunia
ఆదివారం, 8 జులై 2018 (14:43 IST)
విక్టరీ వెంకటేష్ - మీనా జంటగా నటించిన చిత్రం "అబ్బాయిగారు". ఈ సూపర్ హిట్ మూవీలో హీరోకు పిన్నిగా నటించిన నటి జయచిత్ర. ఈమెకు కారు డ్రైవర్ చేతబడి చేశాడు. పైగా, ఆమె ఇంటిని నకిలీ పత్రాలు సృష్టించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దీనిపై న్యాయపోరాటం చేసిన జయచిత్ర విజయం సాధించింది.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, తనకు కోడంబాక్కం, రంగరాజపురంలోని భాస్కర్‌ వీధిలో ఓ ఇల్లు ఉంది. తన దగ్గర పని చేసే కారు డ్రైవర్‌ ఇళమ్ మురుగన్, మీనా దంపతులకు ఆ ఇంటిని అద్దెకు ఇచ్చాను. గత 12 ఏళ్లుగా వాళ్లు అద్దె చెల్లించకుండా అందులో జీవిస్తున్నారు. నమ్మకస్తుడు కావటంతో ఆమె కూడా ఇబ్బంది పెట్టలేదు. 
 
అయితే అద్దె చెల్లిస్తున్నట్లు నకిలీ పేపర్లు సృష్టించి ఆ ఇంటిని ఆక్రమించుకోవాలని ఇళమ్ కుట్ర పన్నాడు. ఈ క్రమంలో తనపై చేతబడి కూడా చేశాడని జయచిత్ర ఆరోపించారు. నమ్మకంగా ఉన్న వ్యక్తి మోసం చేయటంతో మనస్తాపానికి గురైన ఆమె కోర్టును ఆశ్రయించింది. 
 
ఈ న్యాయపోరాటంలో అద్దె డబ్బులో కొంత మేరకు రాబట్టినట్టు తెలిపింది. అలాగే, ఇళమ్‌ మురుగన్‌ను తక్షణమే ఖాళీ చేయాలని న్యాయస్థానం ఆదేశించినట్టు తెలిపారు. కోర్టు తీర్పు సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ నెల 20వ తేదీలోగా ఇల్లు ఖాళీ చేయాలని కోర్టు ఇళమ్‌ మురుగన్‌కు గడువు ఇచ్చిందని, ఆలోగా ఇల్లు ఖాళీ చేయకుంటే  పోలీసుల సాయంతో తాళం బద్ధలు కొట్టి ఇంటిని స్వాధీనం చేసుకుంటానని జయచిత్ర వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments