Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

ఠాగూర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (12:53 IST)
మలయాళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తుంది. ఈ కేసులో మరో ఇద్దరు దర్శకులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకున్నారనో ఆరోపణలతో ఇప్పటికే నటుడు షైన్ టామ్ చాకోను అరెస్టు చేయా, తాజాగా మరో ఇద్దరు దర్శకులను ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన దర్శకుల్లో ఖలీద్ రెహ్మన్, అష్రఫ్ హంజాతో పాటు మరి స్నేహితుడు షలీఫ్‌ను కొచ్చిన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. దర్శకుల అపార్టుమెంట్‌‌లో శనివారం రాత్రి ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించి, కొద్ది మొత్తంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్శకులిద్దరినీ అరెస్టు చేశారు. 
 
దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ, ఆ ముగ్గురు వ్యక్తులు కొన్నేళ్ల నుంచి గంజాయి తీసుకుంటున్నారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సినిమాకు సంబంధించిన చర్చల్లో భాగంగా వారంతా ఒకే అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. మత్తు పదార్థాలను వారికి ఎవరు సఫరా చేస్తున్నారనే విషయంపై విచారణ చేస్తున్నాం అని చెప్పారు. కాగా, మలయాళంలో ఘన విజయం సాధించిన జింఖానా చిత్రానికి ఖలీద్ రెహ్మాన్ దర్శకుడు కాగా, తమాషా చిత్రానికి అష్రఫ్ హంజా దర్శకుడు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

పూజ చేస్తూ కుప్పకూలిపోయిన పూజారి.. అంబులెన్స్ దొరకలేదు.. వైద్యులు లేరు..?

Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్మాత రామ్ తాళ్లూరి

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments