Webdunia - Bharat's app for daily news and videos

Install App

తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న హీరోయిన్!

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (09:25 IST)
తెలుగులో వచ్చిన చిత్రం "బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్". ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ అర్చనా కవి. ఈ మలయాళ బ్యూటీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై మెట్రో రైల్ శ్లాబ్ కాంక్రీట్ పెళ్ళలు ఊడిపడటంతో ఆమె ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
ఈ విషయంపై అర్చన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. తాను ప్రయాణిస్తున్న కారుపై మెట్రో శ్లాబ్ పెళ్లలు ఉన్నట్టుండి విరిగిపడ్డాయనీ, ఈ ప్రమాదం నుంచి తాను రెప్పపాటులో తప్పించుకున్నట్టు తెలిపింది. తాను విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు పేర్కొంది. 
 
ఈ ఘటనలో తన కారు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. అందువల్ల కారుతో పాటు.. కారు డ్రైవర్‌కు కూడా మెట్రో రైల్ అధికారులు తగిన పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments