Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్‌లో విషాదం... రోడ్డు ప్రమాదంలో నటుడు దుర్మరణం

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (13:09 IST)
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఓ రోడ్డు ప్రమాదంలో నటుడు కొల్లం సుధి (39) దుర్మరణం పాలయ్యారు. కేరళలోని కైపమంగళం వద్ద సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్ బిను అడిమాలు, ఉల్లాస్, మహేశ్‌లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
వటకరలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సుధి తలకు బలమైన గాయం తగలడంతో ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుధి మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
గత 2015లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన సుధి... పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. సుధి మరణ వార్త తెలిసిన వెంటనే చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది. ఆయన మృతిపట్ల పలువురు నటీనటులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments