Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శృంగారానికి నిరాకరించిన బాలింతరాలైన భార్య... చంపేసిన భర్త...

murderer
, శుక్రవారం, 2 జూన్ 2023 (18:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒక బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు పూర్తయిందో లేదో కట్టుకున్న భర్త.. బాలింత అయిన భార్యను తన కోర్కె తీర్చమన్నారు. కానీ, అతని కోర్కెను భార్య సున్నితంగా తిరస్కరించింది. శరీర నొప్పులు ఉన్నాయని, పైగా, నీరసంగా ఉందని, అందువల్ల ఇపుడు పడక సుఖం ఇవ్వలేనని చెప్పింది. దీంతో ఆగ్రహించిన కామాంధుడైన భర్త ఆమెను హత్యచేశాడు. ఈ దారుణం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని చారుకొండ ప్రాంతం అగ్రహారం తండాకు చెందిన జటావత్‌ తరుణ్‌ (24), ఝాన్సీ (20) ప్రేమించుకుని 2021లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నగరానికి వచ్చి ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ ఖాజాబాగ్‌లోని మదర్సా అష్రాఫ్‌ ఉల్‌ ఉలూం పరిసరాల్లో ఉంటున్నారు. తరుణ్‌ ఆటోడ్రైవర్‌గా కొనసాగుతున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు. గత ఏప్రిల్‌ 16వ తేదీన ఝాన్సీ మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
 
ఈ క్రమంలో గత నెల 20వ తేదీన అర్థరాత్రి తన కోరికను తీర్చాలని భార్యను తరుణ్‌ కోరాడు. అయితే, తనకు నీరసంగా ఉందంటూ శారీరక సుఖానికి సమ్మతించలేదు. దీంతో భర్త వినిపించుకోకుండా బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బిగ్గరగా కేకలు వేసేందుకు ప్రయత్నించడంతో తరుణ్‌కు పట్టరాని కోపం వచ్చింది. దీంతో తన కుడిచేతితో భార్య తలను మంచంపై అదిమి పెట్టాడు. మరో చేత్తో ఆమె కేకలు వేయకుండా ముక్కు, నోరు అదిమిపట్టాడు. కొంతసేపు అలాగే ఉంచడంతో ఆమెకు ఊపిరాడక ప్రాణాలు విడిచింది. 
 
ఆ తర్వాత ఝాన్సీ గుండెపోటుతో చనిపోయిందంటూ తమ బంధువులతో పాటు ఇరుగుపొరుగువారికి తరుణ్ సమాచారం చేరవేయడంతో వారంతా కలిసి హుటాహుటిన కంచన్‌బాగ్‌లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించి పోలీసులకు సమాచారమివ్వగా వారు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి శవపరీక్షకు తరలించారు. 
 
ఝాన్సీ తండ్రి నెనావత్‌ రేఖ్యా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తరుణ్‌ ఏమీ తెలియనట్లే ఉన్నాడు. మంగళవారం పోస్టుమార్టం నివేదిక రావడంతో అసలు విషయం బహిర్గతమైంది. తరుణ్‌ను అదుపులోకి తీసుకుని వారు విచారించగా ఆరోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించాడు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు - మే నెలలో రూ.3,285 కోట్లకు సేల్స్