Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు - మే నెలలో రూ.3,285 కోట్లకు సేల్స్

liquor bottles
, శుక్రవారం, 2 జూన్ 2023 (17:41 IST)
తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు సాగుతున్నాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఒక్క మే నెలలోనే 7.44 కోట్ల బీరు బాటిళ్లను మందుబాబులు తాగేశారు. గత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా నెల రోజుల వ్యవధిలో ఈ బీర్లను తాగేయడం గమనార్హం. మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో ప్రభుత్వ ఖజానా కాసులతో కళకళలాడిపోతుంది. ఒక్క మే నెలలోనే రూ.3,285 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగాయని ఆ రాష్ట్ర అబ్కారీ అధికారికంగా వెల్లడించింది. జూన్ ఒక్కటో తేదీన మాత్రమే రూ.300 కోట్ల మేరకు అమ్మకాలు జరిగినట్టు తెలిపింది. 
 
మే నెలలో ఎండలో విపరీతంగా ఉండటంతో పాటు పెళ్లిళ్ళు సైతం పెద్ద సంఖ్యలో ఉండటంతో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అత్యధికంగా 64,48,469 లక్షల కేసులు బీర్ల అమ్మకాలు జరిగినట్టు వెల్లడించింది., మే 31వ తేదీన ఒక్క రోజే 2,55,526 బీర్ల అమ్మకాలు జరిగాయంటే లిక్కర్ సేల్ ఏ రేంజ్‌లో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాగే బుధవారం కూడా 3,31,961 మద్యం బాటిళ్ల అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 
 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వెయ్యికిపైగా బార్లు, క్లబ్బులు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.100 నుంచి రూ.150 కోట్ల మేరకు మద్యం విక్రయం జరుగుతోంది. 2022-23 ఆర్థిక  సంవత్సరంలో రూ.35,145.10 కోట్ల విలువైన 3.52 కోట్ల లిక్కర్ కేసులు, 4.79 కోట్ల బీరు కేసులు అమ్మకాలు జరిగినట్టు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారాహిపై గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లనున్న జనసేనాని