Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేరా భారత్ మహాన్... జనాభాలో మనదే అగ్రస్థానం

population
, గురువారం, 19 జనవరి 2023 (10:05 IST)
మేరా భారత్ మహాన్ అని భారత్ మరోమారు నిరూపించింది. జనాభానాలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. డ్రాగన్ కంట్రీ చైనాను అధికమించింది. ఫలితంగా ప్రపంచ దేశాల్లో అత్యధిక జనభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 
 
చైనాలో జననాల రేటు ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనాల ప్రకారం 2022 ఆఖరు నాటికి భారత్ జనాభా 141.7 కోట్లు కాగా, తాజాగా అంటే ఈ నెల 18వ తేదీ 2023 నాటికి ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకున్నట్టు అంచనా వేసింది. 
 
మరో అంతర్జాతీయ మార్కెట్ పరిశోధక సంస్థ మాక్రోట్రెండ్స్ మాత్రం భారత్‌లో ప్రస్తుత జనాభా 142.8 కోట్లకు చేరిందని తెలిపింది. అంటే ఇటీవల చైనా ప్రకటించిన జనాభా గణాంకాల కంటే ఇది ఎక్కువ అని తెలిపింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించినట్టయింది.
 
మరోవైపు, 2022 నవంబర 15వ తేదీన పుట్టిన శిశువుతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లుగా ఉండగా, అది 48 యేళ్లో అది రెట్టింపయింది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గడం, ఆయుర్ధాయం పెరగడం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణమని ఐరాస తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లిమండపానికి మెట్రో రైల్లో వెళ్లిన వధువు.. ఎందుకో తెలుసా?