మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

ఠాగూర్
బుధవారం, 15 అక్టోబరు 2025 (12:50 IST)
మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ మెగా ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో మాళవికను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. చిరంజీవి - బాబి కాంబినేషన్‌లో గతంలో "వాల్తేరు వీరయ్య" వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఇపుడు మరోమారు ఇదే కాంబోలో మరో సినిమా రానుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 'మిరాయ్' చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించగా, నవంబరు 5వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనాలతో ప్రారంభించనున్నట్టు చిత్రవర్గాల సమాచారం. 
 
ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్‌గా మాళవికా మోహనన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈమె గతంలో 'మాస్టర్', 'తంగలాన్' తమిళ చిత్రాల్లో నటించారు. ఇపుడు తెలుగులో ప్రభాస్ తరపున "రాజాసాబ్" మూవీలో నటించనున్నారు. ఇపుడు మెగాస్టార్‌తో జతకట్టే గోల్డెన్ ఛాన్స్‌ను కొట్టేసిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments