Varun Tej, Lavanya Tripathi celebrated Karva Chauth festival
ఉత్తరాది రాష్ట్రాలలో భార్యభర్తల ప్రేమను వ్యక్తం చేయడానికి పౌర్ణమి నాడు డాబాపై నిలబడి జల్లెడలోంచి చంద్రుని వంక చూస్తూ భర్త మొహం చూడడం అనేది ఆచారం. పవిత్రమైన దాంపత్యానికి ప్రేమకు ప్రతీకగా భావిస్తుంటారు. తెలుగులో డబ్ అయినా చాలా సినిమాలలో ఇటువంటి ఆచారాన్ని చూపించారు. తాజాగా ఉత్తరాదికి చెందిన లావణ్య త్రిపాఠి ఆశ్వయుజ మాసంలో అక్టోబర్ 9 వచ్చిన పౌర్ణమి నాడు తన భర్త వరుణ్ తేజ్ ప్రేమను పొందినట్లు ఫొటోలను షేర్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఇలా పౌర్ణమినాడు చూడడాన్ని కర్వా చౌత్ లేదా కరక చతుర్థి అంటారు. హిందూ చాంద్రమానం దీపావళికి ముందుగా వస్తుంది. ఇది హిందూ పండుగ. ఈ పండుగ ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని హిందూ మహిళలు జరుపుకుంటారు. అనేక హిందూ పండుగల మాదిరిగానే, కర్వా చౌత్ కూడా హిందూ పంచాంగం ప్రకారం చంద్ర, సౌర గ్రహాలపై ఆధారపడి ఉంటుంది. కర్వా చౌత్ ని వెన్నెల వెచ్చదనం, నవ్వు మరియు అంతులేని ప్రేమతో జరుపుకున్నారు.
ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన ఈ దంపతులు చాలా సంతోషంగా ఈ పౌర్ణమినాడు వేడుక చేసుకున్నారు. ఇరువుల తల్లిదండ్రుల సమక్షంలో పండుగ వాతావరణం వారి ఇంటిలో నెలకొంది. చంద్రుని కంటే ప్రకాశవంతంగా వరుణ్ తేజ్ ప్రేమ అంటూ లావణ్య త్రిపాఠి కాప్షన్ తో సోషల్ మీడియాలో అలరించింధి. అభిమానులు వారి దాంపత్య జీవితానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.