Webdunia - Bharat's app for daily news and videos

Install App

షణ్ముఖ్‌ దీప్తికి ఇచ్చిన చివరి ముద్దు: మలుపు మేకింగ్ వీడియో వైరల్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (13:55 IST)
Deepti Sunaina
దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ తమ ఐదేళ్ల బంధాన్ని 2022లో ముగించారు. షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి షో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అతను షోలో ఉన్నప్పుడు, దీప్తి సునైనా అతనికి చాలా మద్దతు ఇచ్చింది. 
 
షణ్ణూ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత, దీప్తి షణ్ముఖ్‌ను ఎక్కడా కలవలేదు. వీరు కలిసి ఉన్న ఫోటోలు సైతం ఏమీ బయటకు రాలేదు. దీంతో ఈ వ్యవహారం అనేక పుకార్లకు దారితీసింది. 
 
చివరగా, జనవరి 1 న, వారిద్దరూ తాము విడిపోయిన వార్తలను ధృవీకరించారు. మరోవైపు సిరి-షణ్ముఖ్ పాల్గొనే టీవీ షోలు టీఆర్పీ రేటింగ్ పరంగా దూసుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీప్తి సునైనాకు షణ్ముఖ్‌కు ఇచ్చిన ముద్దు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
మలుపు అనే సాంగ్ కోసం ఇద్దరూ కలిసి నటించారు. షూటింగ్ సందర్భంగా దీప్తి-షణ్ముఖ్ బాగా టీమ్‌తో కలిసి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిలోని ఓ ఫోటోలు దీప్తి.. షణ్ముఖ్ ముద్దిస్తున్నట్లు వుంది. ఇదే షన్నుకు దీప్తికి ఇచ్చిన చివరి ముద్దు అంటూ నెట్టింట చర్చ సాగుతోంది. 
 
అలాగే మలుపు మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ వారు మళ్లీ కలిస్తే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments