ఆర్. ఆర్. ఆర్... ఈ పదం అటు పాలిటిక్స్‌లో ఇటు ఫిలిం క్రిటిక్స్‌లో ఈ మధ్య తరచు వినిపిస్తోంది. అందులో ఒకరు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కాగా, మరొకటి దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’.
రౌద్రం, రణం, రుధిరం సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మేకింగ్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది.‘రోర్ ఆఫ్ ఆర్‌ఆర్‌ఆర్’ పేరుతో బయటకు వచ్చిన ఈ వీడియో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది.
చరణ్,తారక్‌ల చిత్రీకరణ సన్నివేశాలు అలరిస్తున్నాయి. అంతే కాకుండా అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ తారాగణం కూడా ఇందులో ఉండటంతో ఆర్.ఆర్.ఆర్. పాన్ ఇండియా సినిమాగా అందరిలో ఆసక్తిని నింపుతోంది. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.