Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలితో భయం లేదు.. ఏప్రిల్ 14న మహేష్ బాబు-మురుగదాస్ సినిమా రిలీజ్..

బాహుబలితో పోటీపడకూడదని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు డిసైడైపోయారు. గత సంవత్సరం 'బాహుబలి' కంటే ముందు 'శ్రీమంతుడు' రిలీజ్ కావలసిందే. కానీ రాజమౌళిపై ఉన్న గౌరవంతో 'బాహుబలి' సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకే

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (10:04 IST)
బాహుబలితో పోటీపడకూడదని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు డిసైడైపోయారు. గత సంవత్సరం 'బాహుబలి' కంటే ముందు 'శ్రీమంతుడు' రిలీజ్ కావలసిందే. కానీ రాజమౌళిపై ఉన్న గౌరవంతో 'బాహుబలి' సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకే అత్యంత ప్రతిష్టాత్మకం అని భావించిన మహేష్ ఆ రేస్ నుంచి తప్పుకుని ఏకంగా 'బాహుబలి' కి ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి తలెత్తే ఛాన్సే లేదంటున్నారు సినీ జనం. 
 
ఫిలింనగర్‌లో వినపడుతున్న వార్తల ప్రకారం మురగదాస్ మహేష్ బాబుల మూవీకి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. తమిళ ఉగాది రోజు కావడంతో సెంటిమెంట్‌గా డేట్ బాగుంటుందనే నిర్ణయానికి మహేష్, మురుగదాస్‌‌లు వచ్చినట్లు టాక్. ఏప్రిల్ 28న 'బాహుబలి 2' విడుదల అవుతున్నా ఆ రిలీజ్ డేట్‌కు ఇంకా రెండు వారాలు సమయం ఉంది కాబట్టి ఈ గ్యాప్ తమకు చాలు అన్న ఉద్దేశ్యంలో మురుగదాస్-మహేష్ బాబు తమ సినిమాను విడుదల చేయాలని డిసైడైపోయారు.  
 
అయితే ఈ సినిమాకు మహేష్ ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినా కేవలం రెండు వారాల గ్యాప్ తో వచ్చే 'బాహుబలి 2' కోసం ధియేటర్ల కోసం జరిగే వేటను తట్టుకుని మహేష్ సినిమా ఎంత వరకు నిలబడగలదు అన్న అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాలు ఏమి మహేష్ పట్టించుకోవడం లేదు అని టాక్. ఇక దీపావళికి రిలీజ్ కాబోతున్న మహేష్ సినిమా టీజర్‌కు వచ్చే స్పందన బట్టి ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మరింత క్లారిటీ వస్తుందని టాక్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments