Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నాప్, మర్డర్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్... నిజమా?

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌పై కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో అమెను అరెస్టు చేసేందుకు ముంబై పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పైగా ఆమె ఆచూకీ తె

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (08:46 IST)
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌పై కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో అమెను అరెస్టు చేసేందుకు ముంబై పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పైగా ఆమె ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు. 
 
ఏంటి.. ఈ వార్త నిజమేనా అనే కదా మీ సందేహం. ఈ తరహా వార్తల సోషల్ మీడియా ట్విటర్‌లో కనిపించింది. ఇది వైరల్‌గా మారింది. తీరా ఆరా తీస్తేగానీ.. ఇది రియల్ లైఫ్ కాదనీ.. రీల్ అని తేలిపోయింది. ఓ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌‌ను విద్యాబాలన్ ఇలా తన ట్విటర్ ప్రోఫైల్‌లో ఇలా డిఫరెంట్‌గా పెట్టింది. 
 
విద్యా బాలన్ నటిస్తున్న 'కహానీ-2' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ కూడా ఇలాగే రిలీజ్ చేశారు. ఇందులో విద్య దుర్గా రాణీ సింగ్‌ పాత్రలో కన్పించబోతోంది. విద్యాబాలన్ మెయిన్ రోల్‌లో తెరకెక్కిన "కహానీ" సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. కనపడకుండా పోయిన తన భర్త ఆచూకీని తెలుసుకునేందుకు ఓ గర్భిణీ ఎలా ముందుకెళ్లిందనే ఇతివృత్తంతో సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన కహాని బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలిచింది. 
 
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌గా 'కహానీ-2' తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇలా డిఫరెంట్‌గా పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో విద్యాబాలన్‌తో పాటు అర్జున్‌ రామ్ పాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఎక్కవ భాగం షూటింగ్ కోల్‌కతా జరిగింది. ఈ చిత్రం డిసెంబర్‌ 2న విడుదల కాబోతోంది. 

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...

మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు

కిడ్నీల దానం పేరు మనుషుల అక్రమ రవాణా.. కేరళ వాసి అరెస్టు!!

పెట్రోల్ బంకులో పేలిన లారీ ఆయిల్ ట్యాంక్, అందరూ పారిపోయారు కానీ ఒక్కడు మాత్రం - video

200 మంది విటులకు హెచ్.ఐ.వి రోగాన్ని అంటించిన వ్యభిచారిణి.. ఎక్కడ?

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments